కుబేరుడి అప్పు తీరలేదా స్వామీ : రూ.12వేల కోట్లకు చేరిన TTD డిపాజిట్లు

తిరుమల: తిరుమల వేంకటేశ్వరస్వామి మరో రికార్డ్ క్రియేట్ చేశారు. తన ఆస్తుల రికార్డ్ ను తానే తిరగ రాసుకున్నారు స్వామి. దేశవ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో టీటీడీ ఫిక్స్ డ్ డిపాజిట్లు 12వేల కోట్ల రూపాయలకు చేరాయి. టీటీడీ అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ, ప్రైవేట్ బ్యాంకుల్లో 12వేల కోట్ల రూపాయలకు చేరిన డిపాజిట్ల నుంచి టీటీడీ ఏడాదికి 854 కోట్ల రూపాయలను వడ్డీ రూపంలో తీసుకుంటోంది.
Also Read : మళ్లీ మొదలెట్టండీ : టిక్ టాక్ పై బ్యాన్ ఎత్తివేత
ఈ డబ్బును టీటీడీ నిర్వహణకు, భక్తుల సౌకర్యాలకు వినియోగిస్తుంది. మిగతా డబ్బును తిరిగి మళ్లీ డిపాజిట్లు చేస్తోంది. ఇప్పటి వరకు టీటీడీ దగ్గర 8.7 టన్నుల స్వచ్ఛమైన బంగారం ఉంది. దీనికితోడు మరో 550 కేజీల బంగారం ఆభరణాల రూపంలో ఉంది. ఇవి కాకుండా వజ్రాలు కూడా ఉన్నాయి. భక్తులు సమర్పించే బంగారు ఆభరణాలను తర్వాత కరిగించి.. కడ్డీల రూపంలో భద్రపరుస్తారు.
మొత్తం 8.7 టన్నుల బంగారంలో వెయ్యి 938 కేజీల బంగారం ఇండియన్ ఓవర్ సీస్ బ్యాంకులో, 5వేల 387 కేజీల బంగారాన్ని స్టేట్ బ్యాంక్ ఇండియాలో డిపాజిట్ చేశారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ లో డిపాజిట్ చేసిన ఒక వెయ్యి 381 కేజీల బంగారానికి సంబంధించి కాలపరిమితి ముగిసిన తర్వాత.. ఇది టీటీడీ ఖాజానాకు చేరింది. ఈ విషయంపైనా ఇప్పుడు రాద్దాంతం నడుస్తోంది. మొత్తంగా బ్యాంకుల్లోని శ్రీవారి సొమ్ము డిపాజిట్లు 12వేల కోట్ల రూపాయలకు చేరటం ఓ రికార్డ్.
Also Read : ట్విట్టర్‌లో కొత్త ఫీచర్ : ఎలక్షన్ ట్వీట్లపై కంప్లయింట్ చేయొచ్చు