Wrestler Andre The Giant: రెజ్లర్ ఆండ్రే ది జెయింట్ అరచేతి వీడియో వైరల్
ఆండ్రే ది జెయింట్.. 7.4 అంగుళాల ఎత్తుతో, 236 కిలో గ్రాముల బరువుతో 1970, 1980ల్లో రెజ్లింగ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి సంపాదించిన వ్యక్తి. ఆండ్రే ది జెయింట్ ఆకారం చూసి ఆయనను ప్రపంచపు ఎనిమిదవ వింత అని కూడా అనేవారు. తాజాగా ఆయనకు సంబంధించిన పాత వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఆండ్రే ది జెయింట్ తన అరచేతిని ఓ టీవీ యాంకర్ ముఖంపై పెడతాడు. ముఖం మొత్తం ఆ అరచేతితో నిండిపోతుంది.

Wrestler Andre The Giant: ఆండ్రే ది జెయింట్.. 7.4 అంగుళాల ఎత్తుతో, 236 కిలో గ్రాముల బరువుతో 1970, 1980ల్లో రెజ్లింగ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి సంపాదించిన వ్యక్తి. ఆండ్రే ది జెయింట్ ఆకారం చూసి ఆయనను ప్రపంచపు ఎనిమిదవ వింత అని కూడా అనేవారు. తాజాగా ఆయనకు సంబంధించిన పాత వీడియో ఒకటి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
ఆండ్రే ది జెయింట్ తన అరచేతిని ఓ టీవీ యాంకర్ ముఖంపై పెడతాడు. ముఖం మొత్తం ఆ అరచేతితో నిండిపోతుంది. దీంతో ఆండ్రే ది జెయింట్ చేతులు ఎంత పెద్దగా ఉండేవో ఈ వీడియో ద్వారా అర్థమవుతుంది. డబ్ల్యూడబ్ల్యూఈ రెజ్లర్లు సాధారణంగా చాలా లావుగా, ఎత్తుగా, బలంగా ఉంటారు. వారందరిలోనూ ఆండ్రే ది జెయింట్ మరింత ప్రత్యేకం.
ఆండ్రే ది జెయింట్ ఫ్రెంచ్ ప్రొఫెషనర్ రెజ్లరే కాకుండా నటుడిగానూ కొనసాగారు. అమెరికా, జపాన్ రెజర్ టీమ్ ల ప్రచారం బాధ్యలలోనూ పనిచేశారు. ఆండ్రే ది జెయింట్ 46 ఏళ్ల వయసులో 1993, జనవరి 28న ప్యారీస్ లో హృదయ వైఫల్యంతో మృతి చెందారు.
10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..