Viral Video: శరవేగంగా స్పందించి బామ్మ ప్రాణాలు కాపాడిన చిన్నారి

కొందరు చిన్నారులు చాలా చురుకుగా ఉంటారు. చదువు, ఆటల్లోనే కాదు.. మిగతా అన్ని విషయాల్లోనూ వేగంగా స్పందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఇటువంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. శరవేగంగా స్పందించిన ఓ బాలుడు ఓ బామ్మ ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఓ బాలుడు తమ ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్నాడు.

Viral Video: శరవేగంగా స్పందించి బామ్మ ప్రాణాలు కాపాడిన చిన్నారి

Updated On : December 22, 2022 / 8:07 PM IST

Viral Video: కొందరు చిన్నారులు చాలా చురుకుగా ఉంటారు. చదువు, ఆటల్లోనే కాదు.. మిగతా అన్ని విషయాల్లోనూ వేగంగా స్పందిస్తూ స్ఫూర్తిగా నిలుస్తుంటారు. ఇటువంటి ఘటనే చైనాలో చోటుచేసుకుంది. శరవేగంగా స్పందించిన ఓ బాలుడు ఓ బామ్మ ప్రాణాలు కాపాడారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయ్యాయి. ఓ బాలుడు తమ ఇంటి వద్ద ఆడుకుంటూ ఉన్నాడు.

ఆ సమయంలో అతడి అమ్మమ్మ ఓ రూఫ్ ఎక్కి ఏదో పనిచేయాలనుకుంది. నిచ్చెన తెచ్చుకుని ఎక్కింది. ఇంతలో ఆ నిచ్చెన ఒక్కసారిగా జారి కిందపడిపోయింది. ఆ బామ్మ రూఫ్ ను రెండు చేతులతో పట్టుకుని వేలాడుతూ ఉండిపోయింది. ఈ విషయాన్ని గుర్తించిన చిన్నారి వెంటనే నిచ్చెన వద్దకు వెళ్లాడు. ఎంతో కష్టపడి నిచ్చెనను లేపాడు.

దీంతో ఆ బామ్మ నిచ్చెనపై కాళ్లు పెట్టింది. అనంతరం మెల్లిగా నిచ్చెన దిగి వచ్చింది. ఆ బాలుడు వెంటనే సరైన రీతిలో స్పందించకపోయి ఉంటే పెను ప్రమాదమే జరిగేది. రూఫ్ ను చేతులతో పట్టుకున్న ఆ బామ్మ తన బరువును ఎంతో సేపు మోసే అవకాశాలు లేవు. ఆమె అంత పై నుంచి కింద పడితే ప్రాణాలు పోయేవని కొందరు నెటిజన్లు కామెంట్లు చేశారు. బాలుడు స్పందించిన తీరును ప్రశంసిస్తున్నారు.

Supreme Court: పెద్ద నోట్లరద్దుపై 50కి పైగా పిటిషన్లు.. జనవరి 2న తీర్పు ఇవ్వనున్న సుప్రీంకోర్టు