మందు కొట్టి పాముతో ఆటలు.. మూడుసార్లు కాటేసింది

రాజస్థాన్ లోని ఓ వ్యక్తి మద్యం మత్తులో పాముతో ఆడుకున్నాడు. ఆడుకోవడం మాత్రమే కాదండీ.. దానితో మూడుసార్లు కాటు కూడా వేయించుకున్నాడు. ఈ ఘటన రాజస్థాన్‌లోని దూసై జిల్లాలో జరిగింది. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
దీంతో ఆ ఉరు వాళ్లంతా పనులు మానేసి ఒక్కసారిగా పరిగెత్తుకుంటూ ఆ ప్రాంతానికి వచ్చారు. అక్కడ ఆ వ్యక్తి పాముతో ఆడుకునే విధానం షాక్ కి గురయ్యారు. ఆ పామును చూస్తే అక్కడి వారికి దగ్గరకు వెళ్లాలన్నా భయంవేసింది. కానీ అతను మాత్రం పాముతో ఓ రేంజ్ లో ఆడుకున్నాడు.
అయితే, ఆ పాముతో వ్యక్తి ఆటలాడుమే కాదు దాన్ని కొద్దిసేపు మెడలో వేసుకుని, అటూ ఇటూ తిప్పుతూ దానికి నరకం చూయించాడు. ఆ వ్యక్తి పేరు ప్రకాష్ మహావర్. అయితే, ప్రకాష్ ఫుల్లుగా మందు కొట్టి ఉండడం వల్ల అతడికి కనీసం పాముతో ఆడుతున్న విషయం కూడా తెలియకుండా పోయిందని గ్రామస్తులు తెలిపారు.