Veera Simha Reddy: మేకింగ్ వీడియోతోనూ గూస్బంప్స్ తెప్పించిన వీరసింహారెడ్డి!
నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
![Veera Simha Reddy: మేకింగ్ వీడియోతోనూ గూస్బంప్స్ తెప్పించిన వీరసింహారెడ్డి! Veera Simha Reddy: మేకింగ్ వీడియోతోనూ గూస్బంప్స్ తెప్పించిన వీరసింహారెడ్డి!](https://10tv.in/wp-content/uploads/2022/12/Balakrishna-Shines-In-Veera-Simha-Reddy-Making-Video.jpg)
Balakrishna Shines In Veera Simha Reddy Making Video
Veera Simha Reddy: నందమూరి బాలకృష్ణ ‘వీరసింహారెడ్డి’ సినిమాతో సంక్రాంతి బరిలో దిగుతుండటంతో ఈ సినిమా కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాను దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తుండగా, పూర్తి యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ మూవీ వస్తుండటంతో ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా క్రియేట్ అయ్యాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ఈ చిత్ర పోస్టర్స్, వీడియో గ్లింప్స్, సాంగ్స్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేశాయి.
Veera Simha Reddy: ట్రైలర్ డేట్ ఫిక్స్ చేసిన వీరసింహారెడ్డి.. లాంచ్ అక్కడేనా..?
అయితే తాజాగా న్యూ ఇయర్ కానుకగా ఈ సినిమా నుంచి మేకింగ్ వీడియోను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘రోర్ ఆఫ్ వీరసింహారెడ్డి’ అంటూ ఈ మేకింగ్ వీడియోను రిలీజ్ చేయగా, ఇందులో బాలయ్య పవర్ఫుల్ లుక్‌లో కనిపించడంతో అభిమానులు ఈ వీడియోను తెగ ఎంజాయ్ చేస్తున్నారు. ఇక థమన్ మరోసారి తనదైన మ్యూజిక్‌తో ఈ వీడియోను నెక్ట్స్ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఈ మేకింగ్ వీడియోలో సినిమాలోని పలు యాక్షన్ సీన్స్, సాంగ్స్‌కు సంబంధించిన మేకింగ్‌ను మనకు చూపించారు.
Veera Simha Reddy: సంక్రాంతి బరిలో రెండు తమిళ సినిమాలతో సమానంగా దిగుతున్న వీరసింహారెడ్డి!
ఇక సినిమాలోని పలువురు నటీనటులు, టెక్నీషియన్లు ఈ మేకింగ్ వీడియోలో మనకు కనిపించారు. ఈ సినిమాలో బాలయ్య రెండు వైవిధ్యమైన గెటప్స్‌లో కనిపిస్తుండటంతో ఈ సినిమాలో ఆయన పాత్ర ఎలా ఉండబోతుందా అని అభిమానులు ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమాలో అందాల భామ శ్రుతి హాసన్ బాలయ్యతో రొమాన్స్ చేస్తుండగా, మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని ప్రొడ్యూస్ చేస్తున్నారు.