IPL 2023: శతక్కొట్టిన శుభ్‌మన్.. భువనేశ్వర్ ఐదు వికెట్లు తీసినా.. హైదరాబాద్‌పై గుజరాత్ ఘన విజయం
గుజరాత్ టైటాన్స్ అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది. సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గెలుపొందింది.
GT vs SRH: గుజరాత్ టైటాన్స్ అన్ని విభాగాల్లోనూ అదరగొట్టింది. సొంత గడ్డపై సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో 34 పరుగుల తేడాతో గెలుపొందింది. లక్ష్య ఛేదనలో సన్ రైజర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 154 పరుగులకే పరిమితమైంది. సన్‌రైజర్స్ బ్యాటర్లలో హెన్రిచ్ క్లాసెన్ (64; 44 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సర్లు) ఒక్కడే అర్దశతకంతో రాణించగా భువనేశ్వర్ కుమార్(27) ఫర్వాలేదనిపించాడు. అన్మోల్ప్రీత్ సింగ్(5), అభిషేక్ శర్మ(4), రాహుల్ త్రిపాఠి(1), కెప్టెన్ మార్క్రమ్(10), అబ్దుల్ సమద్(4)లు ఘోరంగా విఫలం అయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో మహ్మద్ షమీ, మోహిత్ శర్మ చెరో నాలుగు వికెట్లు తీయగా, యశ్ దయాల్ ఓ వికెట్ పడగొట్టాడు.
అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన గుజరాత్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 188 పరుగులు చేసింది. శుభ్ మన్ గిల్(101; 58 బంతుల్లో 13 ఫోర్లు, 1 సిక్స్) ఐపీఎల్లో తన తొలి శతకాన్ని సాధించాడు. సాయి సుదర్శన్(47; 36 బంతుల్లో 6 ఫోర్లు, 1 సిక్స్)రాణించగా మిగిలిన వారంతా సింగిల్ డిజిట్ కే పరిమితం అయ్యారు. సన్ రైజర్స్ బౌలర్లలో భువనేశ్వర్ కుమార్ ఐదు వికెట్లు తీయగా, మార్కో జాన్సెన్, ఫరూఖీ, నటరాజన్‌లు ఒక్కొ వికెట్ పడగొట్టారు.
IPL 2023: సన్‌రైజర్స్ పై గుజరాత్ ఘన విజయం
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజరాత్ కు మొదటి ఓవర్లోనే భువనేశ్వర్ కుమార్ షాకిచ్చాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే ఓపెనర్ వృద్ధిమాన్ సాహా(0) ను డకౌట్ చేశాడు. దీంతో పరుగుల ఖాతా తెరవక ముందే గుజరాత్ మొదటి వికెట్ కోల్పోయింది. అయితే.. మరో ఓపెనర్ గిల్, వన్‌డౌన్ బ్యాటర్ సాయి సుదర్శన్ సన్‌రైజర్స్ బౌలర్లపై ఎదురుదాడికి దిగారు. ముఖ్యంగా గిల్ చూడ చక్కని క్రికెటింగ్ షాట్లతో అలరించాడు. పవర్ ప్లే(6 ఓవర్లు) ముగిసే సరికి గుజరాత్ 65/1 తో నిలిచింది.
ఓ వైపు గిల్ దూకుడు కొనసాగించగా, మరో వైపు సాయి సుదర్శన్ చక్కని సహకారం అందించాడు. శుభ్‌మన్ ధాటిగా ఆడడంతో స్కోరు బోర్డు పరుగులు పెట్టింది. ఈ క్రమంలో గిల్ 22 బంతుల్లో అర్ధశతకాన్ని పూర్తి చేశాడు. హాప్ సెంచరీ తరువాత గిల్ మరింత వేగం పెంచాడు. అయితే.. సాయి సుదర్శన్‌ను పెవిలియన్‌కు చేర్చి ప్రమాదకరంగా మారిన వీరి జోడిని మార్కో జాన్సెస్ విడదీశాడు. దీంతో 147 పరుగుల రెండో వికెట్ భాగస్వామ్యానికి తెరపడింది.
IPL 2023 : నేను బౌలింగ్ చేసుంటే.. 40 పరుగులకే రాజస్థాన్ ఆలౌట్ : విరాట్ కోహ్లి
ఓ వైపు గిల్ ధాటిగా ఆడగా మరో వైపు హార్ధిక్ పాండ్యా(8), డేవిడ్ మిల్లర్(7), రాహుల్ తెవాటియా(3)లు విపలం అయ్యారు. మరోవైపు 19వ ఓవర్లో నటరాజన్ బౌలింగ్‌లో సింగిల్ తీసి 56 బంతుల్లో ఐపీఎల్లో తన తొలి శతకాన్ని అందుకున్నాడు గిల్.
చివరి ఓవర్లో నాలుగు వికెట్లు.. భవనేశ్వర్ హ్యాట్రిక్ మిస్
చివరి ఓవర్‌ను భువనేశ్వర్ కుమార్ వేశాడు. మొదటి బంతికి సమద్‌కు క్యాచ్ ఇచ్చి శుభ్‌మన్ గిల్ ఔట్ కాగా, రెండో బంతికి రషీద్ ఖాన్(0) వికెట్ కీపర్ క్లాసెన్ చేతికి చిక్కాడు. మూడో బంతికి నూర్ అహ్మద్(0) రనౌట్ అయ్యాడు. భువనేశ్వర్ కుమార్ కు హ్యాట్రిక్ మిస్ అయినా టీమ్ హ్యాట్రిక్ వచ్చింది. ఐదో బంతికి మహ్మద్ షమీ(0) మార్కో జాన్సన్ చేతికి చిక్కాడు. దీంతో భువనేశ్వర్ ఖాతాలో ఐదు వికెట్లు పడ్డాయి. ఆఖరి ఓవర్లో రెండు పరుగులే రావడంతో గుజరాత్ 200 పరుగుల మార్క్‌ను చేరుకోలేకపోయింది.