Kashmira Shah : 14 సార్లు ప్రయత్నించినా తల్లిని కాలేకపోయా.. కానీ సల్మాన్ ఇచ్చిన సలహా వల్ల..

బాలీవుడ్ బ్యూటీ కాశ్మీర షా.. తాను 14 సార్లు ప్రయత్నినా తల్లిని కాలేకపోయానని, సల్మాన్ ఇచ్చిన సలహా వల్లే ఇద్దరి పిల్లలకి తల్లి అయ్యినట్లు చెప్పుకొచ్చింది.

Kashmira Shah : 14 సార్లు ప్రయత్నించినా తల్లిని కాలేకపోయా.. కానీ సల్మాన్ ఇచ్చిన సలహా వల్ల..

Kashmira Shah said she became a mother because of Salman khan advice

Kashmira Shah : తెలుగు సినిమాలతో వెండితెరకు పరిచయం అయిన బాలీవుడ్ బ్యూటీ కాశ్మీర షా. వెంకటేష్ ‘ఇంటిలో ఇల్లాలు వంటింటిలో ప్రియురాలు’, నాగార్జున ‘రాముడొచ్చాడు’ సినిమాల్లో స్పెషల్ సాంగ్స్ చేసిన ఈ భామ.. ఆ తరువాత హిందీ, తమిళ్, మరాఠీ, భోజపురి సినిమాల్లో కూడా నటించింది. అలాగే బాలీవుడ్ లో.. బిగ్ బాస్ 1, ఫియర్ ఫ్యాక్టర్: ఖత్రోన్ కే ఖిలాడీ 4, నాచ్ బలియే 3 వంటి ప్రముఖ టీవీ షోల్లో కంటెస్టెంట్ గా కనిపించింది. ఇక ఈ అమ్మడి వ్యక్తిగత విషయానికి వస్తే.. 2003లో బ్రాడ్ లిట్టర్‌మాన్‌ ను పెళ్లి చేసుకొని నాలుగేళ్ళ తరువాత విభేదాలతో విడిపోయింది.

OMG 2 Teaser : సూపర్ హిట్ సీక్వెల్ టీజర్ వచ్చేసింది.. ఈసారి నాస్తికుడు కోసం కాదు.. భక్తుడు కోసం!

ఆ తరువాత ప్రముఖ యాక్టర్ అండ్ టీవీ హోస్ట్ కృష్ణ అభిషేక్‌ను 2013లో పెళ్లి చేసుకుంది. వీరిద్దరి కలిసి ప్రముఖ కపిల్ శర్మ షోలో అనేకసార్లు కనిపించారు. దీంతో బి-టౌన్ లో ఈ జంట మంచి గుర్తింపుని సంపాదించుకుంది. అయితే ఈ జంట పిల్లలు విషయంలో చాలా ఏళ్ళు బాధ పడ్డారట. పిల్లలు కోసం దాదాపు 14 సార్లు ప్రయత్నించినా ఫలితం లేకుండా పోయిందట. ఐవీఎఫ్ ద్వారా బిడ్డని కనడానికి ప్రయత్నించినా సక్సెస్ కాలేదు. కానీ సల్మాన్ ఇచ్చిన ఒక్క సలహాతో వీరిద్దరూ తల్లిదండ్రులు అయ్యినట్లు ఇటీవల ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.

Dhwani : షార్ట్ ఫిలిం చేసిన పదేళ్ల కుర్రాడు.. నిర్మాత బెల్లంకొండ సురేష్ చేతుల మీదుగా విడుదలైన ‘ధ్వని’

సరోగసీ ద్వారా తల్లిదండ్రులు అవ్వడానికి ప్రయత్నించండి అని సల్మాన్ సూచించాడట. దీంతో కాశ్మీర అండ్ కృష్ణ సరోగసీ ద్వారా ప్రయత్నించి దాదాపు పెళ్ళైన నాలుగేళ్ల తరువాత ఇద్దరు పిల్లలకు తల్లిదండ్రులయ్యారు. అయితే పిల్లలు పుట్టాక చాలా బాధ పడిన విషయం తెలియక, గ్లామర్ కోసమే కాశ్మీర సరోగసీకి వెళ్ళిందంటూ వార్తలు వచ్చాయి. ఇప్పుడు అసలు విషయం చెప్పి ఆ వార్తలన్నీ రూమర్స్ అని కాశ్మీర కొట్టిపడేసింది. ప్రస్తుతం సల్మాన్ ఇచ్చిన సలహాతో తమ ఇంట సందడి నెలకొంది అంటూ తెలియజేసింది.