YS Avinash Reddy : వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు

వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు మూడో సప్లమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేశారు. సీబీఐ మూడో చార్జీషీట్ ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది.

YS Avinash Reddy : వివేకా హత్య కేసులో వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు

YS Avinash Reddy

Viveka Case : వివేకా హత్య కేసులో ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డికి సీబీఐ కోర్టు సమన్లు జారీ చేసింది. ఆగస్టు 14న కోర్టుకు హాజరు కావాలంటూ సమన్లు జారీ అయ్యాయి. వివేకా హత్య కేసులో అనుబంధ చార్జీషీట్ ను కోర్టు పరిగణనలోకి తీసుకుంది. అవినాష్ రెడ్డితోపాటు వైఎస్ భాస్కర్ రెడ్డి, ఉదయ్ కుమార్ రెడ్డిపై సీబీఐ చార్జీషీట్ వేసింది. ఈ కేసులో అవినాష్ రెడ్డిని ఎనిమిదో నిందితుడుగా సీబీఐ చేర్చింది.

వివేక హత్య కేసులో సీబీఐ అధికారులు మూడో సప్లమెంటరీ చార్జీషీట్ ను దాఖలు చేశారు. సీబీఐ మూడో చార్జీషీట్ ను సీబీఐ కోర్టు పరిగణనలోకి తీసుకుంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టైన ఎంపీ అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డితోపాటు ఉదయ్ కుమార్ రెడ్డి, అవినాష్ రెడ్డిపై కోర్టులో సీబీఐ అధికారులు చార్జీషీట్ దాఖలు చేశారు.

Supreme Court : అవినాష్ రెడ్డి బెయిల్ రద్దుపై విచారణ.. అవినాష్ రెడ్డి, సీబీఐకి సుప్రీంకోర్టు నోటీసులు జారీ

ఈ చార్జీషీట్ ను పరిగిణనలోకి తీసుకున్న సీబీఐ కోర్టు అవినాష్ రెడ్డిని ఏ8గా చేర్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టు 14న కోర్టు హాజరు కావాలంటూ అవినాష్ రెడ్డికి సమన్లు జారీ చేసింది. గతంలో అనేకసార్లు సీబీఐ అవినాష్ రెడ్డిని విచారించింది. ఇటీవల అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకుండా తెలంగాణ హైకోర్టు అతనికి ముందస్తు బెయిల్ మంజూరు చేసింది.