Kodali Nani : నా మాట వినకపోతే, ఎన్టీఆర్‌కు పట్టిన గతే నీకూ పడుతుంది- పవన్ కల్యాణ్‌ను హెచ్చరించిన కొడాలి నాని

చంద్రబాబు వెల్ విషర్స్ అంతా పవన్ కల్యాణ్ సపోర్టర్లు. చంద్రబాబు ఎప్పటికీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి.. Kodali Nani - Pawan Kalyan

Kodali Nani : నా మాట వినకపోతే, ఎన్టీఆర్‌కు పట్టిన గతే నీకూ పడుతుంది- పవన్ కల్యాణ్‌ను హెచ్చరించిన కొడాలి నాని

Kodali Nani Warns Pawan Kalyan

Kodali Nani – Pawan Kalyan : గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని.. జనసేన అధినేత పవన్ కల్యాణ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాను పవన్ ను కలవాలని, ఓ విషయం చెప్పాలని చాలాసార్లు ప్రయత్నం చేశానన్నారు. కానీ, పవన్ కల్యాణ్ తనకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు అన్నారాయన. అదే సమయంలో పవన్ కల్యాణ్ కు ఓ హెచ్చరిక చేశారు కొడాలి నాని. రాజకీయ జీవితం ఇచ్చిన ఎన్టీ రామారావుకే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుని నమ్మితే కనుక.. పవన్ కల్యాణ్ కు కూడా అదే గతి పడుతుందని కొడాలి నాని వార్నింగ్ ఇచ్చారు.

పవన్ రాజకీయాల్లోకి రావొచ్చని, సీఎం జగన్ పై విమర్శలు చేయొచ్చని, ప్రభుత్వం చేసే తప్పులను ఎత్తి చూపొచ్చని, అందులో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని కొడాలి నాని అన్నారు. కానీ, చంద్రబాబుతో కలిసి తమపై దాడి చేయాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని పవన్ కల్యాణ్ ను హెచ్చరించారు కొడాలి నాని.(Kodali Nani)

Also Read..Pendurthi Constituency: పెందుర్తిలో ఈసారి హైవోల్టేజ్ పోటీ.. అందుకే పంచకర్ల రమేశ్‌బాబు పార్టీ మారారా?

”ఎన్నికలు అయ్యే వరకు పవన్ కల్యాణ్ రాష్ట్ర ప్రజల మధ్య తిరిగితే మాకేమీ అభ్యంతరం లేదు. కాకపోతే పవన్ కల్యాణ్ కు నా విజ్ఞప్తి. కలిసి మాట్లాడాలని ప్రయత్నం చేశాను. అది కుదరలేదు. పవన్ మాకు అపాయింట్ మెంట్ ఇవ్వలేదు. నేను ఆయనకు ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఆయన అర్థం చేసుకోవాలి.

చంద్రబాబు వెల్ విషర్స్ అంతా పవన్ కల్యాణ్ సపోర్టర్లు. నాదెండ్ల మనోహర్, లింగమనేని వీరంతా చంద్రబాబు వెల్ విషర్స్. చంద్రబాబు ఎప్పటికీ ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండాలి, చంద్రబాబు పరిపాలనే ఉండాలి, ఆయన ద్వారా మనం లబ్ది పొందాలి అని ప్రయత్నించే వారు. వారంతా లబ్ది పొందారు. వారంతా ఇప్పుడు పవన్ కు మద్దతుదారులుగా మారిపోయారు.

ప్రస్తుతం చంద్రబాబు ప్రతిపక్ష నాయకుడు కూడా అయ్యే పరిస్థితి లేదు. అందుకే, పవన్ ను తీసుకొచ్చి ఎంతో కొంత సపోర్ట్ చేస్తే చంద్రబాబుకి కనీసం ప్రతిపక్ష స్థానం అయినా దక్కుతుందనే ప్రయత్నం వారు చేస్తున్నారు. దీన్ని పవన్ కల్యాణ్ గమనించాలి. నిన్ను వాడుకుంటారు. నీకు వెన్నుపోటు పొడుస్తాడు. చంద్రబాబు రక్తంలోనే ప్రతి అణువులోనూ వెన్నుపోటు, అవసరానికి వాడుకోవడం, తర్వాత తీసి పక్కడ పెట్టడం.

Also Read..Nadendla Manohar: ఆ నియోజకవర్గం నాదే.. పోటీపై క్లారిటీ ఇచ్చిన జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్

రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీ రామారావునే మెడ పట్టి పార్టీ నుంచి బయటకు గెంటేశాడు. పార్టీ నుంచి సస్పెండ్ చేశాడు. ఎన్టీ రామారావు పార్టీని, ముఖ్యమంత్రి పదవిని లాక్కున్న 420 చంద్రబాబు. అలాంటి చంద్రబాబుతో కలిస్తే నీకూ ఇదే ఖర్మ పడుతుంది. వాళ్లంతా కలిసి నీకూ అదే గతి పట్టిస్తారు. నువ్వు రాజకీయాల్లోకి రా. 24 గంటలూ ప్రజల్లో తిరుగు. మాకేమీ అభ్యంతరం లేదు. జగన్ పై విమర్శలు చేయ్. ప్రభుత్వం చేసే తప్పులు ఏమైనా ఉంటే ఎత్తి చూపు. మాకేమీ అభ్యంతరం లేదు. కానీ ఈ 420 వాళ్లతో కలిసి నువ్వు మా మీద దాడి చేస్తే చూస్తూ ఊరుకోము.

420లను పక్కన పెట్టుకుని మా మీద దాడి చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో మౌనంగా ఉండము. వాళ్లు ఇచ్చిన స్క్రిప్ట్ చదువుతూ, వాళ్లు ఇచ్చిన రోడ్ మ్యాప్ నువ్వు అమలు చేస్తే, మమ్మల్ని తిట్టే, కొట్టే ప్రయత్నం చేస్తే ఊరుకోము. చంద్రబాబుని సపోర్ట్ చేసే ప్రతి వ్యక్తిని కూడా చంద్రబాబు కన్నా దారుణంగా బట్టలు ఊడదీసి రోడ్డు మీద నిలబెడతాం” అని పవన్ కల్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని” అని పవన్ కల్యాణ్ కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు కొడాలి నాని.

Also Read..Car Explodes : బాబోయ్.. బాంబులా పేలిపోయిన కారు, ఒకరి మృతి, ఇంట్లో పార్కింగ్ చేస్తుండగా ఘోర ప్రమాదం.. అసలేం జరిగింది?