Gandeevadhari Arjuna Censored : వ‌రుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ సెన్సార్ పూర్తి.. ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చారంటే..?

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) న‌టిస్తున్న సినిమా ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) ద‌ర్శ‌కుడు.

Gandeevadhari Arjuna Censored : వ‌రుణ్ తేజ్ ‘గాంఢీవధారి అర్జున’ సెన్సార్ పూర్తి.. ఏ స‌ర్టిఫికేట్ ఇచ్చారంటే..?

Gandeevadhari Arjuna

Gandeevadhari Arjuna : మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ (Varun Tej) న‌టిస్తున్న సినిమా ‘గాండీవధారి అర్జున’. సాక్షి వైద్య (Sakshi Vaidya) హీరోయిన్‌గా న‌టిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ సత్తార్ (Praveen Sattaru) ద‌ర్శ‌కుడు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తుండ‌గా మిక్కీ జే మేయర్ సంగీతాన్ని అందిస్తున్నారు. నాజర్‌, విమలారామన్‌, వినయ్‌ రాయ్ లు కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు. ఈ సినిమా ఆగ‌స్టు 25న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.

Priyanka Chopra : భర్త కన్సర్ట్‌లో స్టాఫ్‌కి స్నాక్స్ పంచుతూ కనిపించిన ప్రియాంక చోప్రా.. ఫిదా అయిన ఫ్యాన్స్

ఈ క్ర‌మంలో చిత్ర బృందం ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాల్లో బిజీగా ఉంది. ఇప్ప‌టికే ఈ సినిమా నుంచి విడుద‌లైన టీజ‌ర్‌, పాటలు, ట్రైల‌ర్ సినిమాపై అంచ‌నాల‌ను పెంచేశాయి. తాజాగా ఈ సినిమా సెన్సార్ పూర్తి చేసుకుంది. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి యూ/ఏ(U/A) స‌ర్టిఫికేట్ ఇచ్చింది. అంతేకాదు సెన్సార్ బృందం ఈ చిత్రానికి పాజిటివ్‌గానే రెస్సాన్స్ ఇచ్చిన‌ట్లు తెలుస్తోంది. యాక్ష‌న్ సీన్స్ అదిరిపోయాయ‌ని, ట్విస్టులు కూడా ఆకట్టుకుంటాయ‌ని సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల అల‌రిస్తుంద‌ని సెన్సార్ బోర్డు స‌భ్యులు చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

Sonam Kapoor-Rana : క్ష‌మాప‌ణ‌లు చెప్పినా.. రానాకి సోనమ్‌ కపూర్ కౌంటర్ ఇచ్చిందా..? ఇన్‌స్టా పోస్ట్ వైరల్..!

ఇదిలా ఉంటే.. గాంఢీవధారి సినిమా విడుద‌ల‌కు సిద్ధంగా ఉండ‌గా వ‌రుణ్‌తేజ్ మ‌రో సినిమా చేస్తున్నాడు. వ‌రుణ్ తేజ్ కెరీర్‌లో 13వ చిత్రంగా తెర‌కెక్కుతోంది. ఓ యధార్థ సంఘ‌ట‌న ఆధారంగా ఇండియ‌న్ ఎయిర్ ఫోర్స్ నేప‌థ్యంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటుంది. నూత‌న ద‌ర్శ‌కుడు శ‌క్తి ప్ర‌తాప్ సింగ్ ఈ సినిమాని డైరెక్ట్ చేస్తున్నాడు. రెనైసెన్స్ పిక్చర్స్, సోని పిక్చర్స్ లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో మాజీ ప్రపంచ సుందరి, బాలీవుడ్ భామ మానుషి చిల్లర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. ‘ఆపరేషన్ వాలెంటైన్’ పేరుతో  తెర‌కెక్కుతున్న ఈ సినిమా డిసెంబ‌ర్ 8న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.