Pakistan Team: పాక్ జట్టులో బయటపడ్డ విబేధాలు.. బాబర్, షాహీన్ అఫ్రిది మధ్య గొడవ

శ్రీలంకతో మ్యాచ్ తరువాత డ్రెస్సింగ్ రూంలో కెప్టెన్ బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది గొడవపడ్డారని తెలిసింది. కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన సరిగా లేదని అసహనం వ్యక్తం చేయడంతో

Pakistan Team: పాక్ జట్టులో బయటపడ్డ విబేధాలు.. బాబర్, షాహీన్ అఫ్రిది మధ్య గొడవ

Babar Azam, Shaheen Afridi

Asia Cup 2023 : ఆసియా కప్ 2023 టోర్నీ నుంచి పాకిస్థాన్ జట్టు నిష్క్రమించిన విషయం తెలిసిందే. గత మూడు రోజుల క్రితం ఆసియా కప్ సూపర్ -4లో పాకిస్థాన్ వర్సెస్ శ్రీలంక జట్లు తలపడ్డాయి. అయితే, శ్రీలంక చేతిలో పాక్ ఓడిపోయింది. దీంతో వన్డే ప్రపంచ‌కప్ ఆరంభానికి ముందు ఆసియా కప్ పాకిస్థాన్‌ను గట్టి దెబ్బతీసింది. పేవరెట్ జట్లలో ఒకటిగా ఉన్న పాక్ జట్టు బలహీనతలను ఆసియా కప్ ఎత్తిచూపింది. దీనికితోడు ఆటగాళ్ల మధ్య విబేధాలు ఆ జట్టును ఫైనల్‌కు దూరం చేశాయన్న ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమేనని తేలింది. శ్రీలంకతో మ్యాచ్ ఓటమి తరువాత డ్రస్సింగ్ రూంలో పాక్ ప్లేయర్స్ మధ్య వాదోపవాదనలు జరిగాయని పాక్ మీడియా పేర్కొంది.

Asia Cup Final 2023: ఫైనల్ పోరు.. అమీతుమీకి సిద్ధమైన భారత్, శ్రీలంక జట్లు.. ఇరు జట్ల బలాబలాలు ఇలా..

శ్రీలంకతో మ్యాచ్ తరువాత డ్రెస్సింగ్ రూంలో కెప్టెన్ బాబర్ అజామ్, షాహీన్ అఫ్రిది గొడవపడ్డారని తెలిసింది. కెప్టెన్ బాబర్ మాట్లాడుతూ.. జట్టు ప్రదర్శన సరిగా లేదని అసహనం వ్యక్తం చేయడంతో పాటు ఆటగాళ్లు బాధ్యతగా ఆడటం లేదని ఆవేదన వ్యక్తం చేశారట. ఈ క్రమంలో బాబర్ మాటలకు షాహీన్ అఫ్రిది అడ్డుతగలడంతోపాటు మంచి ప్రదర్శన చేసిన ఆటగాళ్లనూ గుర్తిస్తే బాగుంటుందని కౌంటర్ ఇచ్చినట్లు తెలిసింది. వెంటనే బాబర్ సైతం జట్టులో ఎవరు బాగా ఆడుతున్నారో తనకు తెలుసని బదులిచ్చాడు.

Asia Cup 2023 : ఫైన‌ల్‌కు ముందు శ్రీలంక‌కు గ‌ట్టి ఎదురుదెబ్బ‌.. భార‌త్‌కు స‌గం క‌ష్టాలు త‌ప్పిన‌ట్లే..!

ఈ క్రమంలో వారిద్దరి మధ్య మాటామాటా పెరిగి ఘర్షణకు దారితీసింది. వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఇద్దరిని సముదాయించి షాహీన్‌ను పక్కకు తీసుకెళ్లడంతో వివాదం సర్దుమణిగిందని పాకిస్థాన్ మీడియా పేర్కొంది. ఆసియా కప్ 2023లో భారత్ వర్సెస్ పాకిస్థాన్ జట్ల మధ్య రెండు మ్యాచ్‌లు జరిగాయి. గ్రూప్ లెవల్ మ్యాచ్ వర్షం కారణంగా రద్దుకాగా.. సూపర్ -4లో రిజర్వు డే‌లో జరిగిన మ్యాచ్ లో టీమిండియా విజయం సాధించింది. గత రెండు రోజుల క్రితం శ్రీలంక వర్సెస్ పాక్ మ్యాచ్‌లో చివరి బంతి వరకు ఉత్కంఠ పోరు జరిగింది. చివరికి ఆ మ్యాచ్‌లో పాక్ జట్టు ఓటమిపాలవ్వడంతో ఆసియా కప్ 2023 నుంచి వైదొలిగింది