Revanth Reddy : పాలమూరు – రంగారెడ్డి పూర్తి కాకపోవడానికి కేసీఆర్ కారణం కాదా? రేవంత్ రెడ్డి

చేవెళ్ల గడ్డపై నుంచి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ ది అని అన్నారు. అలాంటి చేవెళ్ల గడ్డపై భీం భరత్ ను గెలిపించి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కోరారు.

Revanth Reddy : పాలమూరు – రంగారెడ్డి పూర్తి కాకపోవడానికి కేసీఆర్ కారణం కాదా? రేవంత్ రెడ్డి

TPCC President Revanth Reddy (3)

Revanth Reddy – CM KCR : సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ పై టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పాలమూరు రంగారెడ్డి పూర్తి కాకపోవడానికి దుర్మార్గుడు కేసీఆర్ కారణం కాదా అని అన్నారు. ఆడబిడ్డ సునీతమ్మను నడి బజారులో అవమానించిన సంస్కృతి ఇక్కడి ఎమ్మెల్యేదని పేర్కొన్నారు. గతంలో ఇలాంటి సంస్కృతి ఇక్కడ ఉండేదా అని అన్నారు. కేసీఆర్ మీటింగులకు జనం కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఈ మేరకు సోమవారం ఆయన వికారాబాద్ లో మాట్లాడారు. నిఖార్సైన కార్యకర్తలు ఇక్కడ ఉంటే కేసీఆర్ మీటింగుల్లో కిరాయి మనుషులు ఉన్నారని విమర్శించారు.

ఆడబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే టీవీలో కూర్చుని డ్రామారావు పచ్చి అబద్ధాలు చెబుతున్నాడని విమర్శించారు. 2023 ఎన్నికల సమరభేరి వికారాబాద్ గడ్డపై నుంచి మొదలైందని అన్నారు. 2018లో జరిగిన తప్పిదం మళ్లీ జరగొద్దని చంద్ర శేఖర్ ను ఒప్పించి వారికి జహీరాబాద్ టికెట్ ఇవ్వడం జరిగిందన్నారు. వికారాబాద్ లో ప్రసాద్, జహీరాబాద్ లో చంద్రశేఖర్, పరిగిలో రామ్మోహన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు. తాండూరులో కాంగ్రెస్ గెలవాలని మనోహర్ రెడ్డిని పార్టీలో చేర్చుకున్నామని తెలిపారు.

BJP : 18న బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదల? 30 నుండి 35 సీట్లు వారికే..!

చేవెళ్ల గడ్డపై నుంచి కాంగ్రెస్ ను అధికారంలోకి తెచ్చిన ఘనత వైఎస్ ది అని అన్నారు. అలాంటి చేవెళ్ల గడ్డపై భీం భరత్ ను గెలిపించి ఈ గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగరేయాలని కోరారు. వికారాబాద్ జిల్లాలో 5 అసెంబ్లీ స్థానాలు గెలిపించాలన్నారు. కేసీఆర్ హుస్నాబాద్ నుంచి ప్రచారం మొదలు పెడితే.. తాను వికారాబాద్ గడ్డపై నుంచి ప్రచారం మొదలు పెడుతున్నానని తెలిపారు.

కేసీఆర్ కు హుస్నాబాద్ కలిసొస్తుందట… తనకు వికారాబాద్ కలిసొస్తుందని వెల్లడించారు. ఎవరికేది కాలిసొస్తుంది అనేది డిసెంబర్ 3న తెలుస్తుందన్నారు. ప్రాణహిత చేవెళ్లతో ఈ ప్రాంత రైతాంగం కష్టాలు తీర్చాలని కాంగ్రెస్ భావించిందని తెలిపారు. తెలంగాణ వచ్చి పదేళ్లు గడిచినా రైతుల కల నెరవేరలేదన్నారు. ప్రాజెక్టు పడావు బడటానికి కేసీఆర్ కారణం కాదా అని నిలదీశారు. ఈ ప్రాంతానికి గోదావరి జలాలు రాకపోవడానికి బీఆర్ఎస్ కారణం కాదా అని ప్రశ్నించారు.

Nagam Janardhan Reddy : పార్టీకి ద్రోహం చేసిన వారికి టికెట్లా? పొంగులేటి కూడా ఒక లీడరేనా- నాగం జనార్దన్ రెడ్డి నిప్పులు

వచ్చే ఇందిరమ్మ రాజ్యంలో కాంగ్రెస్ ఆరు గ్యారంటీలను అమలు చేసి తీరతామని తెలిపారు. ఇందిరమ్మ రాజ్యం రావాలని గ్యారంటీ కార్డుకు పూజ చేసి ఓటు వేయండి అని అన్నారు. ప్రజల జీవితాల్లో వెలుగులు రావాలంటే కాంగ్రెస్ చేతి గుర్తుకు ఓటేయాలని కోరారు. డిసెంబర్ 9, 2023 ఉదయం 10.30కి ఆరు గ్యారంటీలపై కాంగ్రెస్ తొలి సంతకం పెడుతుందన్నారు. ‘మీ అందరికీ ఇదే నా ఆహ్వానం… డిసెంబర్ 9న ఇందిరమ్మ రాజ్యం ఏర్పాటుకు తరలిరండి’ అని పిలుపునిచ్చారు.