BJP MP Laxman : టీడీపీ పోటీ నుంచి ఎందుకు విరమించుకుందో చెప్పాలి.. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు

కొందరు నేతలు పార్టీని వీడుతున్నంత మాత్రాన బీజేపీకి వచ్చేనష్టం ఏమీలేదని, ప్రజలు, ప్రజల ఓట్లు మాతో ఉన్నాయని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ అన్నారు.

BJP MP Laxman : టీడీపీ పోటీ నుంచి ఎందుకు విరమించుకుందో చెప్పాలి.. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం చేస్తారు

BJP MP Laxman

Telangana Assembly Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ ఎందుకు పోటీ నుంచి విరమించుకుందో చెప్పాలని బీజేపీ రాజ్యసభ సభ్యులు లక్షణ్ ప్రశ్నించారు. టీడీపీ ఇప్పటి వరకు ఎక్కడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నామని చెప్పలేదని అన్నారు. పరస్పరం లాభం ఉంటేనే పొత్తులు ఉంటాయి. జనసేనతో పొత్తు బీజేపీకి లాభిస్తుందని లక్ష్మణ్ చెప్పారు. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ప్రచారం ఉంటుందని అన్నారు.

కొందరు నేతలు పార్టీని వీడుతున్నంత మాత్రాన బీజేపీకి వచ్చేనష్టం ఏమీలేదని, ప్రజలు, ప్రజల ఓట్లు మాతో ఉన్నాయని చెప్పుకొచ్చారు. నేతలు బయటకు వెళ్లినంత మాత్రాన బీజేపీ ఓట్లన్నీ వెళ్లిపోవని అన్నారు. బీసీలను రాహుల్ అవమానిస్తున్నారని, రాహుల్ గాంధీ బీసీలకు క్షమాపణలు చెప్పాలని లక్ష్మణ్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ కేవలం బీసీలను ఓటు బ్యాంకుగా చూస్తుందని విమర్శించారు. బీసీలకు కాంగ్రెస్ పార్టీ చేసిందేమీలేదని లక్ష్మణ్ అన్నారు.

Also Read : Rahul Gandhi : కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ కు ఏటీఎంగా మారింది.. లక్షల కోట్ల ప్రజల సొమ్ము దోపిడీ : రాహుల్ గాంధీ

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ పోటీ నుంచి విరమించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆ పార్టీ తెలంగాణ అధ్యక్ష పదవికి కాసాని జ్ఞానేశ్వర్ సైతం రాజీనామా చేశారు. అయితే, తెలంగాణలోని టీడీపీ కార్యకర్తలు, ఆ పార్టీ అభిమానులు ఎన్నికల్లో ఎవరివైపు మొగ్గుచూపుతారన్న అంశం చర్చనీయాంశంగా మారింది. తెలంగాణలో బీజేపీ, జనసేన పార్టీలు కలిసి పోటీ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. వీరికి టీడీపీ క్యాడర్ మద్దతు ఉంటుందా? లేక కాంగ్రెస్ పార్టీవైపు వీరు మొగ్గుచూపుతారా అనే అంశం ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Also Read : CPM : పొత్తుపై క్లారిటీ ఇవ్వాలి లేకుంటే మా పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తాం.. కాంగ్రెస్ కు మరోసారి సీపీఎం డెడ్ లైన్

మరోవైపు ఎన్నికలవేళ బీజేపీని వీడుతున్నవారి సంఖ్య పెరుగుతోంది. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ఏనుగు రవీందర్ రెడ్డితో పాటు తాజాగా వివేక్ వెంకటస్వామి వంటి నేతలు బీజేపీ రాజీనామా చేశారు. మరికొందరు నేతలు వారిబాటలో పయణించేందుకు సిద్ధమవుతున్నట్లు ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో లక్ష్మణ్ మాట్లాడుతూ.. కొందరు నేతలు పార్టీని వీడినంత మాత్రాన వచ్చేనష్టం ఏమీలేదని, ఓటర్లు బీజేపీ వైపే ఉన్నారని చెప్పారు.