Telangana New CM : తెలంగాణ సీఎం ఎంపికపై స్పందించిన మల్లిఖార్జున ఖర్గే.. ఢిల్లీ వెళ్లిన భట్టి, ఉత్తమ్

ఇవాళ కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గేతో డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల విషయంపై ఎమ్మెల్యేఅ అభిప్రాయలను ఖర్గేకు వివరించనున్నారు.

Telangana New CM : తెలంగాణ సీఎం ఎంపికపై స్పందించిన మల్లిఖార్జున ఖర్గే.. ఢిల్లీ వెళ్లిన భట్టి, ఉత్తమ్

Telangana Congress

Mallikarjun Kharge : తెలంగాణ సీఎం అభ్యర్థి ఎంపికపై సందిగ్దత కొనసాగుతోంది. ఎవరిని సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అధిష్టానం ఎంపిక చేస్తుందోనని తెలంగాణ ప్రజలు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు. అయితే, ఇవాళ సాయంత్రం వరకు సీఎం అభ్యర్థి ఎవరనే విషయంపై అధిష్టానం క్లారిటీ ఇస్తుందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి. మరోవైపు తెలంగాణ సీఎం ఎంపిక విషయంపై ఢిల్లీలో కసరత్తు కొనసాగుతోంది. సీఎం రేసులో రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డిల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే సీఎల్పీ సమావేశంలో సీఎం అభ్యర్థి విషయంపై ఏఐసీసీ పరిశీలకులు డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రేతోపాటు ఇతర పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను సేకరించారు. సీఎల్పీ సమావేశంలో ఏకవాక్య తీర్మానం, ఎమ్మెల్యేల అభిప్రాయాల నివేదికను ఢిల్లీలో పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున్ ఖర్గేకు అందించనున్నారు.

Also Read : Telangana New CM: సీఎం ప్రమాణ స్వీకారం వాయిదా.. ముఖ్యమంత్రి అభ్యర్థి ఎంపికపై ఉత్కంఠ

ఇవాళ మధ్యాహ్నం 12గంటలకు మల్లిఖార్జున ఖర్గేతో డీకే శివకుమార్, మాణిక్ రావు ఠాక్రే భేటీ కానున్నారు. సీఎం, డిప్యూటీ సీఎంల విషయంపై ఎమ్మెల్యేఅ అభిప్రాయలను ఖర్గేకు వివరించనున్నారు. ఖర్గేతో సమావేశం తరువాత డీకే, ఠాక్రే తిరిగి హైదరాబాద్ చేరుకుంటారు. మరోవైపు సీఎం రేసులోఉన్న భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి మంగళవారం ఉదయం ఢిల్లీకి వెళ్లారు. ఢిల్లీలో మల్లికార్జున ఖర్గేతో వారు భేటీ అవుతారు. ఈ భేటీలో సీఎం, డిప్యూటీ సీఎంలు, మంత్రి పదవుల విషయంపై చర్చించనున్నారు. వీరి భేటీ తరువాత సీఎం, డిప్యూటీ సీఎంల విషయంపై అధిష్టానం ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Also Read : JC Prabhakar Reddy : రేవంత్ రెడ్డి సీఎం అయితే.. ఏపీకి మంచి జరుగుతుంది : జేసీ ప్రభాకర్ రెడ్డి

తెలంగాణ సీఎం, డిప్యూటీ సీఎంల విషయంపై ఢిల్లీలో కసరత్తు కొనసాగుతోంది. ఈ అంశంపై తాజాగా పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే స్పందించారు. పార్లమెంట్ లోని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే చాంబర్ లో ఇండియా కూటమి సమావేశం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆ సమావేశానికి వెళ్లే ముందు ఖర్గే మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి ఎవరనేది ఇవాళ నిర్ణయిస్తామని క్లారిటీ ఇచ్చారు.