Rohit Sharma : ధోనిదా, సెహ్వాగ్‌దా?.. ఈ ఇద్ద‌రిలో రోహిత్ శ‌ర్మ‌ ఎవ‌రి రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తాడో..!

టీమ్ఇండియా కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ను టెస్టుల్లో ఓ రికార్డు ఊరిస్తోంది.

Rohit Sharma : ధోనిదా, సెహ్వాగ్‌దా?.. ఈ ఇద్ద‌రిలో రోహిత్ శ‌ర్మ‌ ఎవ‌రి రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తాడో..!

Rohit Sharma will Create New Record for Most Sixes in Test Cricket

Rohit Sharma – MS Dhoni : టీమ్ఇండియా కెప్టెన్‌, హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ ను టెస్టుల్లో ఓ రికార్డు ఊరిస్తోంది. టెస్టు క్రికెట్‌లో టీమ్ఇండియా త‌రుపున అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ఆట‌గాడిగా చ‌రిత్ర సృష్టించేందుకు హిట్‌మ్యాన్‌కు మ‌రో 14 సిక్స‌ర్లు అవ‌స‌రం. ఇప్ప‌టి వ‌ర‌కు రోహిత్ శ‌ర్మ 54 టెస్టులు ఆడాడు. 45.6 స‌గ‌టుతో 3738 ప‌రుగులు చేశాడు. ఇందులో 10 శ‌త‌కాలు 16 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. బౌండ‌రీల విష‌యానికి వ‌స్తే.. 404 ఫోర్లు, 77 సిక్స‌ర్లు బాదాడు.

టీమ్ఇండియా త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు బాదిన ఆట‌గాళ్ల జాబితాలో రోహిత్ ప్ర‌స్తుతం మూడో స్థానంలో కొన‌సాగుతున్నాడు. ఈ జాబితాలో టీమ్ఇండియా మాజీ ఓపెన‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ అగ్ర‌స్థానంలో ఉన్నాడు. అత‌డు 104 టెస్టుల్లో 91 సిక్స‌ర్లు కొట్టాడు. 49.3 స‌గ‌టుతో 8586 ప‌రుగులు చేశాడు. ఇందులో 23 శ‌త‌కాలు 32 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి. 1233 ఫోర్లు బాదాడు.

Virender Sehwag

Virender Sehwag

Also Read: ఫోన్లో షోయబ్ మాలిక్ మొదటి పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా?

టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని ఈ జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. 90 టెస్టుల్లో 78 సిక్స‌ర్లు బాదాడు. 38.1 స‌గ‌టుతో 4876 ప‌రుగులు చేశాడు. ఇందులో 6 శ‌త‌కాలు, 33 అర్ధ‌శ‌త‌కాలు ఉన్నాయి.

MS Dhoni

MS Dhoni

కాగా.. ఇంగ్లాండ్‌తో టీమ్ఇండియా ఐదు మ్యాచుల టెస్టు సిరీస్ ఆడ‌నున్న నేప‌థ్యంలో ఈ సిరీస్‌లోనే హిట్‌మ్యాన్ టెస్టుల్లో అత్య‌ధిక సిక్స‌ర్లు కొట్టిన ప్లేయ‌ర్‌గా నిలిచే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది. ప్ర‌స్తుతం రోహిత్ ఉన్న ఫామ్ చూసుంటే ఇది అత‌డికి పెద్ద కష్టం కాక‌పోవ‌చ్చు. కనీసం రెండు సిక్స‌ర్లు కొట్టిన ధోని రికార్డును అధిగ‌మిస్తాడు.

Also Read: ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌.. కోహ్లీని ఊరిస్తున్న ప‌లు రికార్డులు ఇవే.. ఎన్ని అందుకుంటాడో..?

ఇదిలా ఉంటే.. డ‌బ్ల్యూటీసీ (2023-2025) సీజ‌న్‌లో టీమ్ఇండియా ఫైన‌ల్‌కు చేరుకోవాలంటే ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో భార‌త్ గెల‌వ‌డం ఎంతో కీల‌కం. అదే స‌మ‌యంలో ఎక్కువ టెస్టుల్లో గెల‌వ‌డం ముఖ్యం. ప్ర‌స్తుతం పాయింట్ల ప‌ట్టిక‌లో భార‌త్ రెండో స్థానంలో ఉన్నప్ప‌టికీ మిగిలిన టీమ్‌లు సిరీస్‌లు ఆడ‌నుండ‌డంతో ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు భార‌త్‌కు కీల‌కం.