Ashwin : అరుదైన రికార్డుకు చేరువ‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. ఉప్ప‌ల్‌లోనే అందుకుంటాడా..?

టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు, ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది

Ashwin : అరుదైన రికార్డుకు చేరువ‌లో ర‌విచంద్ర‌న్ అశ్విన్‌.. ఉప్ప‌ల్‌లోనే అందుకుంటాడా..?

Ravichandran Ashwin

Ashwin Records : ఇంగ్లాండ్‌తో సిరీస్‌కు ముందు టీమ్ఇండియా సీనియ‌ర్ ఆట‌గాడు, ఆఫ్ స్పిన్న‌ర్ ర‌విచంద్ర‌న్ అశ్విన్‌ను ఓ అరుదైన మైలురాయి ఊరిస్తోంది. టెస్టు క్రికెట్‌లో  500 వికెట్ల క్ల‌బ్‌లో చేరేందుకు అత‌డికి మ‌రో 10 వికెట్లు అవ‌స‌రం. అశ్విన్ ఇప్ప‌టి వ‌ర‌కు టీమ్ఇండియా త‌రుపున 95 టెస్టు మ్యాచులు ఆడాడు. 490 వికెట్లు తీశాడు. ఇందులో 5 వికెట్లు ప్ర‌ద‌ర్శ‌న 34 సార్లు న‌మోదు చేశాడు. ఇంగ్లాండ్‌తో సిరీస్‌లో ఇంకో 10 వికెట్లు సాధిస్తే ఐదువంద‌ల మైలురాయిని అందుకుంటాడు.

ఈ సిరీస్‌లో అశ్విన్ మ‌రో ఎనిమిది వికెట్లు తీస్తే.. భార‌త్‌, ఇంగ్లాండ్ జ‌ట్ల మ‌ధ్య అత్య‌ధిక వికెట్లు తీసిన భార‌త బౌల‌ర్‌గా చ‌రిత్ర సృష్టిస్తాడు. ప్ర‌స్తుతం ఈ రికార్డు చంద్ర‌శేఖ‌ర్ పేరిట ఉంది. చంద్ర‌శేఖ‌ర్ 38 ఇన్నింగ్స్‌ల్లో 95 వికెట్లు తీశాడు. ఆ త‌రువాత రెండో స్థానంలో అనిల్ కుంబ్లే ఉన్నాడు. కుంబ్లే 92 వికెట్లు సాధించ‌గా అశ్విన్ 35 ఇన్నింగ్స్‌ల్లో ఇంగ్లాండ్ పై 88 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

KS Bharat : శ్రీరాముడికి సెంచ‌రీని అంకితం ఇచ్చిన భ‌ర‌త్‌.. సెల‌బ్రేష‌న్స్ వీడియో వైర‌ల్‌

ఇంగ్లాండ్ పేస‌ర్ జేమ్స్ అండ‌ర్స‌న్ ఈ రెండు దేశాలు త‌ల‌ప‌డిన సంద‌ర్భాల్లో అత్య‌ధిక వికెట్లు తీసిన ఆట‌గాడిగా కొన‌సాగుతున్నాడు. 66 ఇన్నింగ్స్‌ల్లో 139 వికెట్లు ప‌డ‌గొట్టాడు.

100 వికెట్లు..

అశ్విన్ ఇప్ప‌టి వ‌ర‌కు ఇంగ్లాండ్ పై 88 వికెట్లు తీశాడు. మ‌రో 12 వికెట్లు గ‌నుక అత‌డు ఈ సిరీస్‌లో తీస్తే ఇంగ్లాండ్ పై వంద వికెట్లు తీసిన మొద‌టి భార‌త బౌల‌ర్‌గా నిల‌వ‌నున్నాడు. అశ్విన్ ప్ర‌స్తుతం అద్భుత‌మైన ఫామ్‌లో ఉన్నాడు. పైగా సిరీస్ జ‌రిగేది స్వ‌దేశంలో కాబ‌ట్టి ఈ రికార్డు అన్నింటిని అత‌డు ఉప్ప‌ల్‌లో జ‌రిగే మొద‌టి టెస్టు మ్యాచులోనే అందుకున్నా కూడా ఆశ్చ‌ర్య‌పోన‌వ‌స‌రం లేదు. ఇక తెలుగు అభిమానులు కూడా అత‌డు ఈ రికార్డును ఉప్ప‌ల్‌లోనే అందుకోవాల‌ని కోరుకుంటున్నారు.

ఇదిలా ఉంటే.. భార‌త జ‌ట్టు త‌రుపున టెస్టుల్లో అత్య‌ధిక వికెట్లు ప‌డ‌గొట్టి బౌల‌ర్‌గా అనిల్ కుంబ్లే ఉన్నాడు. అత‌డు 132 టెస్టుల్లో 619 వికెట్లు తీశాడు. రెండో స్థానంలో అశ్విన్ ఉన్నాడు.

డ‌బ్ల్యూటీసీ 2023-2025 సైకిల్‌లో భార‌త్ ఫైన‌ల్ చేరుకోవాలంటే ఇంగ్లాండ్‌తో జ‌ర‌గ‌నున్న ఐదు మ్యాచుల టెస్టు సిరీస్‌లో విజ‌యం సాధించ‌డం ఎంతో కీల‌కం. కాగా.. బీసీసీఐ మొద‌టి రెండు టెస్టుల‌కు జ‌ట్టును ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే.

తొలి రెండు టెస్టుల‌కు భార‌త జ‌ట్టు ఇదే..
రోహిత్‌ శర్మ (కెప్టెన్‌), కేఎల్‌ రాహుల్‌ (వికెట్‌ కీపర్‌), శుభ్‌మన్‌ గిల్‌, యశస్వి జైస్వాల్‌, శ్రేయస్‌ అయ్యర్‌, కేఎస్‌ భరత్ (వికెట్‌ కీపర్‌), ధ్రువ్‌ జురెల్ (వికెట్‌ కీపర్‌), ర‌విచంద్ర‌న్ అశ్విన్‌, రవీంద్ర జడేజా, అక్షర్‌ పటేల్‌, కుల్దీప్‌ యాదవ్‌, జస్‌ప్రీత్ బుమ్రా (వైస్‌ కెప్టెన్‌), మ‌హ్మ‌ద్‌ సిరాజ్‌, ముకేశ్‌ కుమార్‌, అవేశ్‌ ఖాన్‌.

Rohit Sharma : ధోనిదా, సెహ్వాగ్‌దా?.. ఈ ఇద్ద‌రిలో రోహిత్ శ‌ర్మ‌ ఎవ‌రి రికార్డు బ‌ద్ద‌లు కొడ‌తాడో..!