Telangana Polling : పెరిగిన పోలింగ్ శాతం.. ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం?

2019 లోక్ సభ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ మెరుగైంది. దాదాపుగా పోలింగ్ పర్సెంటేజ్ 70శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది.

Telangana Polling : పెరిగిన పోలింగ్ శాతం.. ఏ పార్టీకి లాభం? ఏ పార్టీకి నష్టం?

Telangana Polling : తెలంగాణలో మూడు ప్రధాన పార్టీలు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ హోరాహోరీగా ప్రచారం నిర్వహించాయి. అటు జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్న పార్టీ బీజేపీ, తెలంగాణలో కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ కాంగ్రెస్, రాష్ట్రంలో అధికారం కోల్పోయిన పార్టీ బీఆర్ఎస్.. ఈ మూడు పార్టీలు ఈసారి లోక్ సభ ఎన్నికల్లో డూ ఆర్ డై అన్నట్లుగా పోరాటం చేశాయి. గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాయి.

ఇక, తెలంగాణలో పోలింగ్ ముగిసింది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ శాతం పెరిగింది. 2019 లోక్ సభ ఎన్నికల్లో 62 శాతం పోలింగ్ నమోదవగా.. ఈసారి పోలింగ్ పర్సెంటేజ్ మెరుగైంది. దాదాపుగా పోలింగ్ పర్సెంటేజ్ 70శాతం వరకు చేరుకునే అవకాశం ఉంది. అయితే, పెరిగిన పోలింగ్ శాతం ఎవరికి లాభం చేయనుంది? ఎవరికి నష్టం చేయనుంది? తమకు లాభం చేసిందని ఆయా పార్టీలు ఎందుకు భావిస్తున్నాయి? ఇంతకీ విజయంపై ఏ పార్టీ అంచనాలు ఏంటి?

Also Read : ఈసారి వారంతా బీజేపీకే ఓటు వేశారు, తెలంగాణలో కొత్త శక్తిగా నిలుస్తుంది- పోలింగ్‌పై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు