ఎవరికి దక్కేనో..? రెండ్రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్ నియామకం

తెలంగాణలో పార్టీ అధికారంలో ఉండడంతో పీసీసీ పోస్టుకు భారీ డిమాండ్ ఉంది. పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ల విషయంలో సామాజిక సమీకరణాల కూర్పును

ఎవరికి దక్కేనో..? రెండ్రోజుల్లో తెలంగాణ కాంగ్రెస్ కు కొత్త పీసీసీ చీఫ్ నియామకం

Gandhi Bhavan

TPCC New Chief : తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి కొత్త పీసీసీ చీఫ్ రాబోతున్నారు. ఒకటి రెండు రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తిచేసేందుకు కేంద్ర పార్టీ అధిష్టానం దృష్టి కేంద్రీకరించింది. ఈనెల 27వ తేదీతో రేవంత్ రెడ్డి పీసీసీ మూడేళ్ల పదవీకాలం ముగియనుంది. దీంతో పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ల నియామకంను ఏఐసీసీ చేపట్టనుంది. ఈ మేరకు సాయంత్రం కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, రాహుల్ గాంధీ కొత్త పీసీసీ చీఫ్ ఎంపికపై సీఎం రేవంత్ రెడ్డితో చర్చించే అవకాశం ఉంది.

Also Read :ఇళ్లలోకి చొరబడి మరీ దాడులు చేస్తున్నారు: పేర్ని నాని, కొడాలి నాని

తెలంగాణలో పార్టీ అధికారంలో ఉండడంతో పీసీసీ పోస్టుకు భారీ డిమాండ్ ఉంది. పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ ల విషయంలో సామాజిక సమీకరణాల కూర్పును ఏఐసీసీ సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతానికి పీసీసీ రేసులో బీసీ సామాజిక వర్గం నుంచి మంత్రి పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మధుయాష్కీ, ఎంపీ సురేష్ షెట్కార్ లు పోటీ పడుతున్నట్లు సమాచారం. అదేవిధంగా రెడ్డి సామాజిక వర్గం నుంచి జానారెడ్డి, జగ్గారెడ్డి, రాజగోపాల్ రెడ్డితో పాటు మంత్రి శ్రీధర్ బాబు కూడా పీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read : నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో చేప ప్రసాదం పంపిణీలో విషాదం

ఎస్సీ సామాజిక వర్గం నుంచి సంపత్ కుమార్, ఎస్టీ సామాజిక వర్గం నుంచి సీతక్క, బలరాం నాయక్ పేర్లు వినిపిస్తున్నాయి. మరోవైపు పార్టీ జాతీయ స్థాయి పోస్టులుసైతం తెలంగాణ నేతలకు దక్కే అవకాశం ఉంది. సిడబ్ల్యూసీ, జనరల్ సెక్రటరీ, సెక్రటరీ పోస్టులకోసం నేతలు పట్టుబడుతున్నట్లు తెలుస్తోంది. ఇవాళ సాయంత్రం లేదా రేపటిలోగా ఈ అంశంపై కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.