Pushpa 2 Update: అందరూ అనుకున్నట్టే పుష్ప 2 వాయిదా.. ఇక డిసెంబరు వరకు ఆగాల్సిందే..
పుష్ప 2ను ముందుగా అనుకున్న తేదీకే విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ షూటింగ్ ఇంకాస్త మిగిలి ఉండడం..
![Pushpa 2 Update: అందరూ అనుకున్నట్టే పుష్ప 2 వాయిదా.. ఇక డిసెంబరు వరకు ఆగాల్సిందే.. Pushpa 2 Update: అందరూ అనుకున్నట్టే పుష్ప 2 వాయిదా.. ఇక డిసెంబరు వరకు ఆగాల్సిందే..](https://10tv.in/wp-content/uploads/2024/06/PUSHPA.jpg)
PUSHPA
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజా సినిమా ‘పుష్ప 2 ది రూల్’ కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. మొదట ఈ ఏడాది ఆగస్ట్ 15న ఈ సినిమాను రిలీజ్ చేయాలని సినిమా యూనిట్ భావించిన విషయం తెలిసిందే. అయితే, కొన్ని కారణాల వల్ల అది వాయిదా పడింది. ఈ మూవీ టీమ్ కొత్త డేట్ ను ప్రకటించింది.
‘పుష్ప-2 ది రూల్’ను ఈ ఏడాది డిసెంబరు 6న విడుదల చేస్తున్నట్లు తెలిపింది. పుష్ప 2ను ముందుగా అనుకున్న తేదీకే విడుదల చేయడానికి ప్రయత్నాలు చేసినప్పటికీ షూటింగ్ ఇంకాస్త మిగిలి ఉండడం, పోస్ట్ ప్రొడక్షన్ పనులూ ఉండడంతో వాయిదా వేస్తున్నట్లు పేర్కొంది.
కాగా, సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా రూపుదిద్దుకుంటోంది. పుష్ప 1 భారీ హిట్ కొట్టడంతో పుష్ప 2పై భారీ అంచనాలు ఉన్నాయి. ఇందులో రష్మిక మందన్న హీరోయిన్. సినిమాలో ఫహద్ ఫాసిల్, ధనంజయ, అనసూయ భరద్వాజ్, సునీల్, రావు రమేశ్, తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ బాణీలు సమకూర్చారు.
![](https://diey8xpfs90ha.cloudfront.net/wp-content/uploads/2024/06/b18dd8f9-f1bc-42f5-99dd-3b1026843ee6.jpg)
PUSHPA
Raa Raja Teaser : భయపెట్టే ‘రా రాజా’ టీజర్.. అల్లరి నరేష్ చేతుల మీదుగా లాంచ్..