Prabhas : ప్ర‌భాస్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌బాస్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది.

Prabhas : ప్ర‌భాస్ గురించి సీఎం రేవంత్ రెడ్డి ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..

CM Revanth Reddy on Prabhas

Prabhas – CM Revanth Reddy : యంగ్ రెబ‌ల్ స్టార్ ప్ర‌బాస్ రేంజ్ రోజు రోజుకి పెరిగిపోతుంది. ‘బాహుబ‌లి’, ‘క‌ల్కి’ సినిమాల‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అంత‌ర్జాతీయ న‌టులు సైతం ప్ర‌భాస్ న‌ట‌న పై ప్ర‌శంస‌లు కురిపిస్తూనే ఉన్నారు. ఇక తాజాగా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సైతం ప్ర‌భాస్‌ను పొగిడారు. ప్ర‌భాస్ లేకుంటే బాహుబ‌లి మూవీనే లేద‌న్నారు.

హైద‌రాబాద్‌లో క్షత్రియ సేవా సమితి ఆధ్వర్యంలో అభినందన సభ ఏర్పాటు చేశారు. ముఖ్య అతిథిగా ఈ కార్య‌క్ర‌మానికి తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి హాజ‌రు అయ్యారు. ఈ సంద‌ర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప‌లు రంగాల అభివృద్ధిలో క్ష‌త్రియుల పాత్ర ఎంతగానో ఉంద‌న్నారు. సినీ రంగం విష‌యానికి వ‌స్తే.. సినీ రంగంలో ఉన్న‌త స్థాయికి ఎదిగిన వ్య‌క్తుల్లో కృష్ణం రాజు ఒక‌రన్నారు. ఆయ‌న పేరు లేకుండా తెలుగు సినిమా పేరు చెప్ప‌లేమ‌న్నారు. ఇక హాలీవుడ్‌కి పోటీ ఇచ్చిన బాహుబ‌లి మూవీని ప్ర‌భాస్ లేకుండా ఊహించ‌లేమ‌ని చెప్పారు.

Raksha Bandhan : సిస్టర్ సెంటిమెంట్‌తో టాలీవుడ్‌లో వ‌చ్చిన సినిమాలు ఇవే..

అదే విధంగా సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్‌గోపాల్ వ‌ర్మ గురించి కూడా సీఎం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్‌కు వెళ్లి అక్క‌డ రాణించిన రామ్‌గోపాల్ వ‌ర్మ త‌న‌కు మంచి మిత్రుడని ముఖ్య‌మంత్రి తెలిపారు. రామ్‌గోపాల్ వ‌ర్మ‌, ప్ర‌భాస్ గురించి ముఖ్య‌మంత్రి మాట్లాడిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

ఇక సినిమాల విష‌యానికి వ‌స్తే.. ‘సలార్’, ‘కల్కి భారీ విజ‌యాలు సాధించ‌డంతో ప్ర‌భాస్ మంచి జోష్‌లో ఉన్నాడు. వ‌రుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్నారు. అలానే రాజా సాబ్, కల్కి 2, సలార్ 2, స్పిరిట్ సినిమాలు ప్ర‌భాస్ చేతిలో ఉన్నాయి.

Akash Jagannadh : ఈ సారి కొడితే గ‌ట్టిగా కొట్టాలి.. ఆకాశ్ జగన్నాథ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు..