AndhraPradesh : ఒంగోలులో దారుణం.. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఈఏపీసెట్ షురూ..! ఏపీ న్యూస్ అప్డేట్స్ ..

ఏలూరు భోగాపురం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం వద్ద గుర్తుతెలియని వాహనం‌ను టాటా ఏసీ వెనక నుండి ఢీకొట్టింది

AndhraPradesh : ఒంగోలులో దారుణం.. కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఈఏపీసెట్ షురూ..! ఏపీ న్యూస్ అప్డేట్స్ ..

Andhrapradesh

AP News : ప్రకాశం జిల్లా ఒంగోలులో దారుణం చోటుచేసుకుంది. బలరాం కాలనీలో ఎనిమిదేళ్ల పాపతో ఉంటున్న ఒంటరి మహిళపై అత్యాచారం చేసేందుకు ముగ్గురు యువకులు ప్రయత్నించారు. ఈ క్రమంలో తప్పించుకుని పారిపోతున్న మహిళను అడ్డగించి యువకులు కొట్టారు. తీవ్రంగా గాయపడిన మహిళను స్థానికులు గమనించి చికిత్స నిమిత్తం ఒంగోలు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

Yuvagalam Padayatra: 100వ రోజుకు చేరిన లోకేశ్ యువగళం పాదయాత్ర.. పాల్గోనున్న భువనేశ్వరి, నారా, నందమూరి కుటుంబ సభ్యులు

100వ రోజుకు చేరిన లోకేశ్ పాదయాత్ర ..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, యువనేత నారా లోకేశ్ చేపట్టిన యువగళం పాదయాత్ర సోమవారంకు 100వ రోజుకు చేరుకుంది. ప్రస్తుతం ఈ పాదయాత్ర నంద్యాల జిల్లా శ్రీశైలం నియోజకవర్గంలో కొనసాగుతుంది. నేటి పాదయాత్రలో లోకేశ్ తల్లి నారా భువనేశ్వరి పాల్గొంటారు. లోకేష్‌తోపాటు యువగళం పాదయాత్ర‌లో ఆమె కొంచెందూరం నడుస్తారు. అదేవిధంగా నారా, నందమూరి కుటుంబ సభ్యులు, లోకేశ్ చిన్ననాటి స్నేహితులు పాదయాత్రలో పాల్గోనున్నారు. మోతుకూరులో 100రోజుల పాదయాత్ర పైలాన్‌ను లోకేశ్ ఆవిష్కరిస్తారు.

Hot Sun : ఏపీలో మండుతున్న ఎండలు.. తీవ్ర వడగాల్పులు

ఏపీలో నేడు తీవ్ర వడగాల్పులు ..

ఏపీలో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పుల తీవ్రత పెరుగుతోంది. ఈ క్రమంలో సోమవారం 127 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 173 మండలాల్లో సాధారణ స్థాయిలో వడగాల్పులు ఉంటాయని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ తెలిపారు. మంగళవారం (16.05.2023) 92 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 190 మండలాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. మిగిలిన చోట్ల కూడా ఎండ ప్రభావం చూపే అవకాశం ఉందని, ప్రజలు ఎండ తీవ్రత పట్ల, వడగాల్పుల పట్ల అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ముఖ్యంగా వృద్దులు, గర్భిణీలు, బాలింతలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.

Friendship : సంతోషకరమైన జీవితం కోసం ఈ 6 రకాల స్నేహితులతో సన్నిహితంగా ఉండటం మంచిదా ?

తిరుమల సమాచారం..

తిరుమల తిరుపతి శ్రీవారిని ఆదివారం 87,022 మంది భక్తులు దర్శించుకున్నారు. దీంతో నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ. 3.40 కోట్లు వచ్చింది. వేసవి సెలవులు కావడంతో తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. సర్వదర్శనం కోసం 17 కంపార్ట్‌మెంట్‌లలో భక్తులు వేచి ఉన్నారు. టోకెన్‌లు లేకుండా శ్రీవారి సర్వదర్శనానికి 18గంటల సమయం పడుతుంది.

 

ఏలూరులో రోడ్డు ప్రమాదం..

ఏలూరు భోగాపురం జాతీయ రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. భోగాపురం వద్ద గుర్తుతెలియని వాహనం‌ను టాటా ఏసీ వెనక నుండి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ వాహనంలో ఇరుక్కుపోయి మృతి చెందాడు. మరోముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. బాధితులను నేషనల్ హైవే అంబులెన్స్‌లో ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏలూరు రూరల్ ఎస్సై. లక్ష్మణ్ బాబు, హైవే సిబ్బంది తెలిపారు.

 

నేటి నుంచి ఈఏపీసెట్..

ఇంజినీరింగ్, ఫార్మసీ, అగ్రికల్చర్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్-2023 కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్ నేటి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచి ఈనెల 19 వరకు ఇంజినీరింగ్ విభాగం, 22, 23 తేదీల్లో అగ్రి, ఫార్మసీ విభాగాల్లో పరీక్ష జరగనుంది. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎగ్జామ్స్ ఉంటాయని, నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను అనుమతించమని అధికారులు స్పష్టం చేశారు.

Kadapa Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుండగా ఘోర రోడ్డు ప్రమాదం.. మృతులంతా తాడిపత్రి వాసులు ..

కడప జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం..

కడప జిల్లా కొండాపురం‌ మండలం ఏటూరు గ్రామం చిత్రావతి బ్రిడ్జి సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తుఫాన్ వాహనం ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఏడుగురు మరణించారు. మరో ఐదుగురికి గాయాలయ్యాయి. తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శనం ముగించుకొని తిరుమ నుండి తాడిపత్రికి తుఫాను వాహనంలో వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. మృతులు తాడిపత్రి వాసులుగా అధికారులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కే సుధీర్ కుమార్ (తుఫాన్ డ్రైవర్), కే సుధ, కే లికిత్ కుమార్ రెడ్డి, ఎల్ లక్ష్మీదేవి, కే సునీల్ కుమార్ రెడ్డి, సుభద్ర, బుజ్జి (రెండు సంవత్సరాల పాప) మరణించారు. గాయపడిన వారిలో ఆదిలక్ష్మి (30) మేఘన రెడ్డి (20) నరసింహారెడ్డి (53) కాటసాని భాస్కర్ రెడ్డి (45) జయలక్ష్మి (55) ఉన్నారు. వీరిని చికిత్స నిమిత్తం తాడిపత్రి ఆస్పత్రికి తరలించారు. వారిలో నలుగురి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స నిమిత్తం అనంతపురం ఆస్పత్రికి తరలించారు. మృతులంతా తాడిపత్రికి చెందిన వారు. అయితే వీరిలో కొంతమంది బళ్లారి జిల్లా కంఫ్లీ‌లో నివాసం ఉంటున్నట్లు సమాచారం

 

వైసీపీ ఎమ్మెల్సీల ప్రమాణ స్వీకారం..

అసెంబ్లీ ప్రాంగణంలో వైసీపీ ఎమ్మె‌ల్సీలు ఈ రోజు ప్రమాణస్వీకారం చేయనున్నారు. వారిలో..

పొన్నపురెడ్డి రామ సుబ్బారెడ్డి (వైఎస్సార్ కడప జిల్లా, వైఎస్సార్సీపీ)

నార్తు రామారావు (శ్రీకాకుళం జిల్లా, వైఎస్సార్సీపీ)

కుడుపూడి సూర్యనారాయణ రావు (తూర్పుగోదావరి జిల్లా, వైఎస్సార్సీపీ)

వంకా రవీంద్రనాథ్ (పశ్చిమగోదావరి జిల్లా, వైఎస్సార్సీపీ)

కావూరు శ్రీనివాస్ (పశ్చిమగోదావరి జిల్లా, వైఎస్సార్సీపీ)

మేరిగ మురళీధర్ (నెల్లూరు జిల్లా, వైఎస్సార్సీపీ)

అలంపూరు మధుసూధన్ (కర్నూలు జిల్లా, వైఎస్సార్సీపీ)

సిపాయి సుబ్రమణ్యం (చిత్తూరు జిల్లా, వైఎస్సార్సీపీ)