Ap Corona Virus: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. మూడో వేవ్ సంకేతమేనా?

కరోనా సెకండ్ వేవ్ కాస్త తక్కువై ఇబ్బందులు తప్పాయి అనుకుంటున్నారు. కానీ, మరోవారంలో కరోనా కేసులు పెరిగే పరిస్థితి ఉన్నట్లుగా ఇప్పటికే వచ్చిన నివేదికలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి.

Ap Corona Virus: ఏపీలో పెరుగుతున్న కోవిడ్ కేసులు.. మూడో వేవ్ సంకేతమేనా?

Ap Corona

Corona Virus: కరోనా సెకండ్ వేవ్ కాస్త తక్కువై ఇబ్బందులు తప్పాయి అనుకుంటున్నారు. కానీ, మరోవారంలో కరోనా కేసులు పెరిగే పరిస్థితి ఉన్నట్లుగా ఇప్పటికే వచ్చిన నివేదికలు కాస్త ఆందోళన కలిగిస్తున్నాయి. కరోనా కేసులు తగ్గుతూ.. పెరుగుతూ ఉండగా.. గత 24గంటల్లో 85,822 శాంపిల్స్‌ని పరీక్షించగా 2,442కొత్త కేసులు వెలుగులోకి వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 19,71,101కు చేరుకుంది. ఇదే సమయంలో కరోనా కారణంగా 16మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం మృతుల సంఖ్య 13,444కు చేరుకుంది. అంతకుముందు రోజు 1546 మందికి మాత్రమే కరోనా పాజిటివ్ వచ్చింది.

అయితే, క్రితం రోజు కంటే కేసులు పెరగడం ఇప్పుడు ఆందోళకు కారణం అవుతుంది. గడిచిన 24 గంటల్లో 2,412మంది వైరస్ బారి నుంచి కోలుకోగా.. రాష్ట్రంలో రికవరీల సంఖ్య 19,37,473కి చేరుకుంది. ప్రస్తుతం 20వేల 184మంది కరోనాతో బాధపడుతున్నారు. కోవిడ్ వల్ల కొత్తగా చిత్తూరు జిల్లాలో ఐదుగురు, అనంతపూర్ జిల్లాలో ఇద్దరు, కృష్ణలో ఇద్దరు, నెల్లూరులో ఇద్దరు, తూర్పు గోదావరి, గుంటూరు, కడప , కర్నూల్‌తోపాటు విశాఖలో ఒక్కొక్కరు చొప్పున మరణించారు.

కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా వేసవిలో ఉండగా.. మూడో వేవ్ ఆందోళన కూడా పెరుగుతూ వస్తోంది. ఇప్పుడు కేసులు పెరగడంతో.. రెండోవారంలో కరోనా వేగం పెరిగే అవకాశం ఉన్నట్లుగా వస్తున్న వార్తలు ఆందోళన పెంచుతోంది. కరోనా మూడో వేవ్‌కు ఈ కేసుల పెరుగుదలే సంకేతమా? అని అనుమానిస్తున్నారు వైద్య నిపుణులు. ఇప్పటికే కేరళ, మహారాష్ట్ర, ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరిగిపోగా మూడో వేవ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నట్లు చెబుతున్నారు.