YS Jagan Mohan Reddy : ఏం జరుగుతోంది? ప్రధాని మోదీతో సీఎం జగన్ కీలక భేటీ
YS Jagan Mohan Reddy : రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్ నిధులు తదితర అంశాలపై జగన్ డిస్కస్ చేశారు.

YS Jagan Mohan Reddy
YS Jagan – PM Modi : ఏపీ సీఎం జగన్ ఢిల్లీలో పర్యటిస్తున్నారు. వరుసగా కేంద్ర పెద్దలతో సమావేశం అవుతున్నారు. ప్రధాని మోదీతో సీఎం జగన్ సమావేశం అయ్యారు. పోలవరం నిర్మాణానికి సహకారం, రీసోర్స్ గ్యాప్ కింద నిధులు, విభజన హామీల అమలుపై ప్రధానిని కోరనున్నారు జగన్. అంతకుముందు గంట పాటు కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో సీఎం జగన్ భేటీ అయ్యారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తోనూ జగన్ సమావేశం కానున్నారు.
Also Read.. Vundavalli Arun Kumar: దీనిపై జగన్, చంద్రబాబు, పవన్ తమ వైఖరేంటో చెప్పాలి: ఉండవల్లి
ఢిల్లీ పర్యటనలో సీఎం జగన్ బిజీబిజీగా ఉన్నారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో వరుసగా సమావేశం అవుతున్నారు. అమిత్ షాతో భేటీలో కీలక అంశాలపై ఆయన చర్చించారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, బకాయిలు, పోలవరం ప్రాజెక్ట్ నిధులు తదితర అంశాలపై జగన్ డిస్కస్ చేశారు. సుమారు గంట సేపు వీరి భేటీ నడిచింది. అనంరతం ప్రధాని మోదీతో ముఖ్యమంత్రి జగన్ సమావేశం అయ్యారు.
ఏపీకి ఆర్థిక సహకారం, పెండింగ్ అంశాలు, రాష్ట్రానికి రావాల్సిన నిధులు-బకాయిలపై ప్రధానంగా కేంద్రం పెద్దలతో చర్చిస్తున్నారు జగన్. గడిచిన ఆరు నెలల్లో ప్రధాని మోదీతో సీఎం జగన్ భేటీ కావడం ఇది మూడోసారి. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థికపరమైన అంశాలతో పాటు రాజకీయ అంశాలు కూడా ఈ సమావేశంతో ముడిపడి ఉన్నాయని సమాచారం. ఎన్డీయేలోకి వైసీపీ వెళ్తుందా? ఆహ్వానిస్తున్నారా? అన్నది తెలియాల్సి ఉంది.
కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఈ క్రమంలో వైసీపీని ఎన్డీయేలోకి ఆహ్వానిస్తున్నారా? అనే చర్చ జరుగుతోంది. ఒకపక్క కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరుగుతోంది. మరోపక్క రాష్ట్రాలకు సంబంధించిన అధ్యక్షులను బీజేపీ పెద్దలు మారుస్తున్నారు. ఇంకోపక్క గవర్నర్ల మార్పు కూడా ఉండనుంది అనే చర్చ నడుస్తోంది. ఇటువంటి కీలక సమయంలో మరొక బీజేపీయేతర పార్టీలకు సంబంధించిన ముఖ్యమంత్రిని ఢిల్లీకి పిలిపించడం, ఆయనకు అపాయింట్ మెంట్ ఇవ్వడం, ఆయన కలవడం.. ఈ పరిణామాల నేపథ్యంలో రాజకీయంగా జగన్, ప్రధాని మోదీ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.