Chandrababu : కుటుంబానికి రూ.25లక్షలు, జగన్ ప్రభుత్వానికి బాబు డిమాండ్

భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను బలి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆకాశంలో విహరిస్తే వరద భాదితుల కష్టాలెలా తెలుస్తాయని సీఎంని..

Chandrababu : కుటుంబానికి రూ.25లక్షలు, జగన్ ప్రభుత్వానికి బాబు డిమాండ్

Chandrababu

Chandrababu : భారీ వర్షాలకు జిల్లాలోని అన్నమయ్య ప్రాజెక్ట్‌ తెగిపోవడం ప్రభుత్వ వైఫల్యమేనని టీడీపీ అధినేత చంద్రబాబు ఆరోపించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించిన చంద్రబాబు వరదల్లో మృతిచెందిన కుటుంబాలకు టీడీపీ తరపున రూ.లక్ష పరిహారాన్ని ప్రకటించారు. వరదల వల్ల నష్టపోయిన కుటుంబాలకు రూ.5వేల ఆర్థిక సాయాన్ని చంద్రబాబు అందించారు. భారీ వర్షాల నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు తీసుకోకుండా ప్రజల ప్రాణాలను బలి చేస్తున్నారని చంద్రబాబు ఆరోపించారు. ఆకాశంలో విహరిస్తే వరద భాదితుల కష్టాలెలా తెలుస్తాయని సీఎంని ప్రశ్నించారు. వరదల్లో మృతి చెందిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలివ్వాలని చంద్రబాబు డిమాండ్ చేశారు.

SBI Alert : ఎస్బీఐ కస్టమర్లకు వార్నింగ్.. ఆ నెంబర్లతో జాగ్రత్త!

” ముమ్మాటికీ ఇది మానవ తప్పిదం. వర్షాలు, తుపాను ఎవరూ ఆపలేం. కానీ వర్షాల తీవ్రతను గుర్తించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. గేట్లు రిపేర్ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేదా? కోట్లాది రూపాయల మేర నష్ట పోయారు. ఇంత పెద్ద ఎత్తున నష్టపోతే ఏరియల్ సర్వే చేస్తారా? వరద ప్రభావిత గ్రామాల్లో పర్యటించకపోవడం దుర్మార్గం.

నాడు ఓట్ల కోసం రోడ్లు పట్టుకుని తిరిగిన జగన్, సీఎం అయ్యాక ఏరియల్ సర్వేతో సరి పెట్టుకోవడం దురదృష్టకరం. పాలిమర్ ఘటన బాధితులకు కోటి రూపాయలు ప్రకటించిన సీఎం జగన్, సర్వస్వాన్ని కోల్పోయి నిరాశ్రయులుగా మారితే 5 లక్షల పరిహారమా? ఇదెక్కడి న్యాయం? మందపల్లిని దత్తత తీసుకుని అన్ని విధాల అభివృద్ధి చేస్తాం. నాడు విశాఖ విపత్తులో నిద్ర పోకుండా సహాయక చర్యలు చేపట్టాం. వారం రోజులు పాటు సహాయక చర్యలు చేపట్టి మాములు స్థితికి తెచ్చాం. కానీ, సీఎం జగన్ మాత్రం కాలు బయటపెట్టకుండా హెలికాప్టర్ లో ఏరియల్ సర్వేతో సరిపెట్టుకున్నారు. ఇదేనా బాధ్యతంటే..? ” అని చంద్రబాబు ఫైర్ అయ్యారు.

Beware Of Children : టీవి, సెల్ ఫోన్లతో గడిపే చిన్నారులతో జాగ్రత్త!….ఎందుకంటే

వరద ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు మూడు రోజుల పాటు పర్యటిస్తారు. వరద బాధిత ప్రాంతాల పర్యటనలో భాగంగా చంద్రబాబు కడప జిల్లాలో పర్యటించారు. రాజంపేట, నందలూరు మండలాల్లోని వరద ప్రభావిత ప్రాంతాలకు వెళ్లారు. పులపత్తూరు, మందపల్లి, తోగూరుపేట, గుండ్లూరు గ్రామాల్లో బాధితులను పరామర్శించారు. వారితో మాట్లాడారు. ఇవాళ మొత్తం కడప జిల్లాలో పర్యటించనున్న చంద్రబాబు.. రేపు చిత్తూరు, ఎల్లుండి నెల్లూరు జిల్లాలకు వెళ్లనున్నారు.