ఒక్కొక్కరికి రూ.75వేలు.. జగన్ ప్రభుత్వం మరో కొత్త పథకం

  • Published By: naveen ,Published On : July 15, 2020 / 03:18 PM IST
ఒక్కొక్కరికి రూ.75వేలు.. జగన్ ప్రభుత్వం మరో కొత్త పథకం

ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన బుధవారం(జూలై 15,2020) జరిగిన కేబినెట్ భేటీలో 22 అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. మహిళలకు జగన్ సర్కార్ మరో తీపి కబురు వినిపించింది. వైఎస్ఆర్ చేయూత పథకానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. వెనుకబడిన వర్గాలకు చెందిన 25లక్షలమందికి పైగా మహిళలకు ఈ పథకాన్ని వర్తింప చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఎన్నికల సందర్భంగా మహిళలకు ఇచ్చిన హామీని అమలు చేస్తూ 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల్లో మహిళల ఖాతాల్లో రూ. 18,750 చొప్పున జమ చేయనున్నారు. ఆర్థిక సాయంగా నాలుగు విడతల్లో మొత్తం రూ.75వేలు ఇవ్వనున్నారు. ఆగస్టు 12న సీఎం జగన్ ఈ పథకాన్ని ప్రారంభించనున్నారు.

ఏపీ కేబినెట్ నిర్ణయాలు:
* నవరత్నాల్లో భాగంగా వైఎస్ఆర్ చేయూత పథకంపై చర్చించిన మంత్రివర్గం
* 45 నుంచి 60 ఏళ్ల మధ్య వయసున్న బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ మహిళలకు ఆర్థిక సాయం అందించే పథకం
* నాలుగు దశల్లో రూ.75వేల ఆర్థిక సాయం అందించే పథకానికి కేబినెట్ ఆమోద ముద్ర
* నాడు-నేడు కార్యక్రమాల్లో భాగంగా స్కూళ్లలో మౌలిక వసతులు పెంపు, మళ్లీ నిధులు విడుదల
* రాయలసీమ డెవలప్‌మెంట్ కోసం ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని నిర్ణయం
* ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీల్లో 420 టీచింగ్, 170 నాన్ టీచింగ్ పోస్టుల భర్తీకి గ్రీన్ సిగ్నల్
* గత ప్రభుత్వం హయాంలో కాంట్రిబ్యూషన్ పెన్షన్ స్కీమ్ రద్దు కోసం ఉద్యోగులు, టీచర్లు చేసిన ఆందోళనలో నమోదైన కేసులు ఎత్తివేత
* గుంటూరు పాత పోలీస్ స్టేషన్‌‌పై దాడి చేశారని కొంత మందిపై ముస్లింలపై కేసులు పెట్టారు వాటిని ఎత్తివేస్తూ నిర్ణయం
* కర్నూలు జిల్లా ప్యాపిలి దగ్గర రూ.5కోట్లతో గొర్రెల పెంపుకందారుల శిక్షణా కేంద్రం ఏర్పాటుకు నిర్ణయం
* అనంతపురం జిల్లాలో మరో కేంద్రం ఏర్పాటకు సుముఖత
* కర్నూలు జిల్లా కొమ్మమొర్రిలో రూ.9కోట్లతో వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ ఏర్పాటు చేయాలని నిర్ణయం
* మెడికల్ హెల్త్ డిపార్ట్‌మెంట్‌లో ఒకేసారి 9వేల 712 ఉద్యోగాల్ని భర్తీ చేయాలని నిర్ణయం