Bandaru Satyanarayana : టీడీపీ నేత బండారు సత్యనారాయణకు ఊరట, బెయిల్ మంజూరు, న్యాయం ధర్మం గెలుస్తుందని కామెంట్

రూ.25వేల పూచీకత్తుతో గుంటూరు కోర్టు బండారు సత్యనారాయణకు బెయిల్ ఇచ్చింది. Bandaru Satyanarayana

Bandaru Satyanarayana  : టీడీపీ నేత బండారు సత్యనారాయణకు ఊరట, బెయిల్ మంజూరు, న్యాయం ధర్మం గెలుస్తుందని కామెంట్

Bail Given To Bandaru Satyanarayana (Photo : Google)

Updated On : October 3, 2023 / 11:03 PM IST

Bail For Bandaru Satyanarayana : మంత్రి రోజాపై అనుచిత వ్యాఖ్యల కేసులో అరెస్ట్ అయిన టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి బండారు సత్యనారాయణకు కోర్టులో ఊరట లభించింది. గుంటూరు స్పెషల్ మొబైల్ కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది. రూ.25వేల పూచీకత్తుతో బండారు సత్యనారాయణకు బెయిల్ ఇచ్చింది. అనుచిత వ్యాఖ్యల కేసులో పోలీసులు బండారు సత్యనారాయణను నిన్న అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.

బండారు సత్యనారాయణని ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు విశాఖ నుంచి గుంటూరు తరలించారు పోలీసులు. మధ్యాహ్నం 3 గంటలకు జీజీహెచ్ లో వైద్య పరీక్షలు నిర్వహించారు. సాయంత్రం 6 గంటలకి స్పెషల్ మొబైల్ కోర్టు జడ్జి ముందు బండారుని ప్రవేశపెట్టారు పోలీసులు. రాత్రి 10 గంటలకు జడ్జి ఆయనకు బెయిల్ మంజూరు చేశారు.

Also Read.. Roja Selvamani : మంత్రి రోజా కంటతడి.. ఈ పరిస్థితి రేపు లోకేశ్ భార్యకూ వస్తుందని సీరియస్ వార్నింగ్

అంబేద్కర్ రాజ్యాంగానికి గౌరవం ఉందని అన్నారు బండారు సత్యనారాయణ. న్యాయం, ధర్మం గెలుస్తుందని చెప్పారు. పోలీస్ స్టేషన్ లో తాను ఎలాంటి ఇబ్బంది పడలేదన్నారు. తనకు నిబంధనలతో కూడిన బెయిల్ ఇచ్చారని తెలిపారాయన. తన కోసం పని చేసిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు బండారు సత్యనారాయణ. టీడీపీ అధినేత చంద్రబాబు త్వరగా జైలు నుంచి బయటకు రావాలని కోరుకున్నారు. కష్ట సమయంలో లోకేశ్ నాకు మనోధైర్యం ఇచ్చారని, ఎంపీ రామ్మోహన్ నాయుడు నాకు మద్దతుగా నిలిచారని బండారు సత్యనారాయణ తెలిపారు.

Also Read..AP Politics: ఏపీలో రాజకీయ కురుక్షేత్రం.. నారా భువనేశ్వరి, బ్రాహ్మణిలే నెక్ట్స్‌ టార్గెట్?