తెలుగు రాష్ట్రాలకు వానగండం : హైదరాబాద్ లో భారీ వర్షాలు!

  • Published By: madhu ,Published On : October 12, 2020 / 06:11 AM IST
తెలుగు రాష్ట్రాలకు వానగండం : హైదరాబాద్ లో భారీ వర్షాలు!

Heavy Rain Forecast : తెలంగాణ, ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం బలపడి తీవ్రవాయుగుండంగా మారే అవకాశముంది. 2020, అక్టోబర్ 12వ తేదీ సోమవారం రాత్రి నర్సాపురం – విశాఖపట్నం మధ్య తీరందాటే అవకాశం ఉంది.



దీని ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమ, తెలంగాణలో భారీ వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్‌తో పాటు ఉత్తర తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి , వరంగల్‌, కరీంనగర్‌ , ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.



సోమవారం, మంగళవారం తెలంగాణలో భారీ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. వాయుగుండానికి తోడు క్యుములోనింబస్‌ మేఘాల ప్రభావంతో హైదరాబాద్‌లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశముంది. దీంతో సీఎం కేసీఆర్ అధికారులను అప్రమత్తం చేశారు. జీహెచ్ఎంసీ విపత్తుల నిర్వహణ టీమ్‌ను సిద్దం చేశారు అధికారులు. ఎంత వర్షం పడ్డా కరెంటు సరఫరాకి బ్రేక్ పడకుండా తగిన చర్యలు తీసుకుంటున్నారు.



పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం తీరందాటే అవకాశం ఉంది. దీంతో సముద్రం అల్లకల్లోంగా మారింది. తీరం వెంబడి గాలులు గంటకు 66 నంచి 60 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయి. కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు కురిసే అవకాశముంది. మత్స్యకారులెవ్వరూ వేటకు వెళ్లొద్దని అధికారులు హెచ్చరించారు
.