తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్న పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది.. రూ.5లక్షల విలువైన లిక్కర్ బాటిళ్లు స్వాధీనం

  • Published By: bheemraj ,Published On : July 10, 2020 / 12:45 AM IST
తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా మద్యం తరలిస్తున్న పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది.. రూ.5లక్షల విలువైన లిక్కర్ బాటిళ్లు స్వాధీనం

పశ్చిమగోదావరి జిల్లాలో భారీగా మద్యం పట్టుబడింది. తెలంగాణ నుంచి ఏపీకి అక్రమంగా తరలిస్తున్న మద్యం బాటిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. రూ.5లక్షల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకుని, ముగ్గురిని అరెస్టు చేశారు. అయితే మద్యం తరలిస్తున్న వారిలో పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది ఉన్నారు. మద్యం తరలిస్తూ పోలీసులు, ఎక్సైజ్ సిబ్బంది పట్టుబడింది. మద్యం తరలిస్తున్న వాహనానికి ఎస్కార్ట్ గా ఎక్సైజ్ సీఐ, వీఆర్ లో ఉన్న ఎస్ ఐ ఉండటం విమర్శలకు దారితీస్తుంది.

లింగగూడెంలో భారీగా మద్యం పట్టుకున్నారు. రూ.5 లక్షల విలువైన మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురిని అరెస్టు చేశారు. ఆంక్షలు ఉండటం, ఇతర రాష్ట్రాల నుంచి మద్యం తరలింపు జరుగకుండా ఒకవైపు ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకుంటూనే ఉంటుంది. ఏపీలో ఎస్ ఈబీను ఏర్పాటు చేశారు. అయితే తెలంగాణ నుంచి భారీ స్థాయిలో సరిహద్దుల్లో మద్యం పట్టుబడుతోంది.

ఈ నేపథ్యంలోనే ఈ రోజు తెలంగాణ నుంచి దాదాపు 557 మద్యం బాటిళ్లతో కార రావడాన్ని గమనించిన పోలీసులు ఆ కారును తనిఖీ చేయడంతో పోలీసులు, ఎక్సైజ్ అధికారులు మద్యం తరలింపు చేస్తున్నారని బయటపడింది. ఎస్ఈబీ బంటు బిల్లిలో పని చేస్తున్న స్పెషల్ ఎన్ ఫోర్స్ మెంట్ బ్యూరోలో పని చేస్తున్న ఎక్సైజ్ సీఐ పులి అనుశ్రీ పట్టుబడ్డారు. ఏలూరు వీఆర్ లో పనిచేస్తున్న విజయ్ కుమార్ పట్టుబడ్డారు.

Read Here>>ప్రైవేట్ స్కూళ్లపై తెలంగాణ విద్యా శాఖ సీరియస్