Sajjala On Pawan : జనసేన తన పార్టీ అని మర్చిపోయినట్టున్నారు- పవన్ మూడు ఆప్షన్లపై సజ్జల

ప‌వ‌న్ ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా కాకుండా ఓ విశ్లేష‌కుడిగా పొత్తుల‌పై ఆప్ష‌న్లు ఇచ్చారు. బీజేపీ వస్తుందో లేదో కానీ టీడీపీతో వెళ్లటం ఖాయమని పవన్ మాటలను బట్టి అర్థం అవుతోంది.(Sajjala On Pawan)

Sajjala On Pawan : జనసేన తన పార్టీ అని మర్చిపోయినట్టున్నారు- పవన్ మూడు ఆప్షన్లపై సజ్జల

Sajjala On Pawan

Sajjala On Pawan : ఏపీలో ఎన్నికలకు ఇంకా రెండేళ్ల సమయం ఉంది. కానీ, అప్పుడే ఎన్నికల హీట్ కనిపిస్తోంది. దీనికి తోడు పొత్తుల అంశం హాట్ టాపిక్ గా మారింది. రాష్ట్ర రాజకీయాలు పొత్తుల చుట్టూ తిరుగుతున్నాయి. ఏ పార్టీ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది? అనేది ఆసక్తి రేపుతోంది. 2024 ఎన్నికల్లో పొత్తులకు సంబంధించి జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో హీట్ పెంచాయి. జనసేన ముందు మూడు ఆప్షన్లు అంటూ పవన్ చేసిన వ్యాఖ్యలు చర్చకు దారితీశాయి. కాగా, పవన్ పొత్తుల ఆప్షన్లపై అధికార వైసీపీ విమర్శలకు దిగింది. పవన్ కు అంత సీన్ లేదని వైసీపీ నేతలు అంటున్నారు.

తాజాగా ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పొత్తులపై స్పందించారు. పవన్ కల్యాణ్ చేసిన మూడు ఆప్షన్ల వ్యాఖ్యలపై సెటైర్లు వేశారు. పొత్తులపై తమ పార్టీ అభిప్రాయం వెల్లడించారాయన. చంద్రబాబు, పవన్ లపై ఆయన విమర్శలతో విరుచుకుపడ్డారు. బీజేపీ, జనసేన పొత్తుల గురించి మాకు సంబంధం లేదని సజ్జల చెప్పారు. పొత్తుల వల్ల ప్రజలను మభ్యపెట్టడమే అవుతుందన్నారు. ప్రజలకు ఏం చేస్తున్నామనేదే ముఖ్యం అని ఆయన స్పష్టం చేశారు. అధికారం కోసమే జరిగే పొత్తులు కరెక్ట్‌ కాదనేది మా అభిప్రాయం అని సజ్జల అన్నారు.(Sajjala On Pawan)

Pawan Kalyan Three Options : 3 ఆప్షన్లతో ముందుకొచ్చిన పవన్.. పొత్తులు, సీఎం అభ్యర్థిపై జనసేనాని హాట్ కామెంట్స్

ఎవరో కట్టిన ట్యూన్‌కు పవన్‌ రాగం అందుకున్నట్లు ఉందని విమర్శించారు. సొంతంగా అధికారంలోకి రావాలనుకుంటే ఆప్షన్లు ఎందుకు? అని పవన్ ను ప్రశ్నించారు. చంద్రబాబును అధికారంలోకి తీసుకురావడం కోసం పవన్ బ్రోకరిజం చేస్తున్నట్లు ఉందని విమర్శించారు. వారిది ఉనికి కోసం ప్రయత్నం అని అన్నారు.

వైసీపీని ఓడించాలనే భ్రమలో వాళ్లు ఉన్నట్లున్నారు అని అన్నారు. పొత్తులపై మాకు విశ్వాసమే లేదన్న సజ్జల.. సీఎం జగన్‌కు ప్రజలపై పూర్తి విశ్వాసం ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లోనూ మాకు ఆదరణ ఉంటుందన్న నమ్మకం ఉందన్నారు.

Roja Satires On Pawan : పవన్‌కు ఒకటే ఆప్షన్ – జనసేనాని మూడు ఆప్షన్లపై మంత్రి రోజా సెటైర్

”రాజ‌కీయంగా సీరియస్‌గా ఉన్న వాళ్లు ఒంట‌రిగానే పోటీ చేయాల‌ని అనుకుంటారు. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఓ రాజ‌కీయ నాయ‌కుడిగా కాకుండా ఓ విశ్లేష‌కుడిగా పొత్తుల‌పై ఆప్ష‌న్లు ఇచ్చారు. జ‌న‌సేన త‌న పార్టీ అన్న విష‌యాన్ని ప‌వ‌న్ మ‌రిచిపోయిన‌ట్టుగా ఉన్నారు. బీజేపీ వస్తుందో లేదో కానీ టీడీపీతో వెళ్లటం ఖాయమని పవన్ కళ్యాణ్ మాటలను బట్టి అర్థం అవుతోంది. తమ కార్యకర్తలను కాపాడుకునేందుకే పవన్ ఈ పొత్తుల వ్యాఖ్యలు చేశారు. చంద్ర‌బాబు వ్యూహాల‌నే ప‌వ‌న్ వ‌ల్లె వేస్తున్న‌ట్లుగా అనిపిస్తోంది. పొత్తుల‌పై ప‌వ‌న్ ఓ మాట‌, జ‌న‌సేన‌తో పొత్తు క‌లిగిన బీజేపీ నేత‌లు మ‌రో మాట మాట్లాడుతున్నారు” అని స‌జ్జ‌ల అన్నారు.

పొత్తుల గురించి పవన్ ప్రస్తావించిన మూడు ఆప్షన్ల వ్యాఖ్యలపై మంత్రి రోజా కూడా సెటైర్లు వేశారు. పవన్ మూడు ఆప్షన్లు ఇస్తే ప్రజలు ఆయనకు ఒకటే ఆప్షన్ ఇస్తారని రోజా అన్నారు. జనసేన పార్టీని ప్రజలు గెలిపించే ప్రసక్తే లేదన్నారామె. అసలు 175 స్థానాల్లో పోటీ చేయకుండానే పవన్ సీఎం ఎలా అవుతారని మంత్రి రోజా ప్రశ్నించారు. పవన్‌ పోరాటం ప్రజల కోసం కాదని, పొత్తుల కోసమేన‌ని విమర్శించారు. 2019 ఎన్నిక‌ల్లో పవన్‌ను రాష్ట్ర ప్ర‌జ‌లు రెండు చోట్ల ఓడించారని గుర్తు చేసిన మంత్రి రోజా.. 2024 ఎన్నిక‌ల్లో అదే రిపీట్‌ అవుతుందని జోస్యం చెప్పారు.