School Girl Suicide : డ్యాన్స్ నేర్చుకోవటం ఇష్టంలేక …

ఇంట్లో తల్లితండ్రుల బలవంతం మీద డ్యాన్స్ నేర్చుకుంటున్న బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.

School Girl Suicide : డ్యాన్స్ నేర్చుకోవటం ఇష్టంలేక …

Visakhapatnam Girl Suicide

Updated On : October 20, 2021 / 1:25 PM IST

School Girl Suicide : ఇంట్లో తల్లితండ్రుల బలవంతం మీద డ్యాన్స్ నేర్చుకుంటున్న బాలిక బలవన్మరణానికి పాల్పడిన ఘటన విశాఖపట్నంలో చోటు చేసుకుంది.  దొండపర్తిలో నివసించే బాలిక  సోమవారం రాత్రి బలవన్మరణానికి పాల్పడింది. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బాలిక ప్రవర్తన గురించి ఇంట్లో తల్లి తండ్రుల నుంచి కొంత సమాచారం సేకరించారు. దర్యాప్తులో భాగంగా బాలిక చదువుతున్న పాఠశాలకు వెళ్లి ఎలా చదువుతుంది..ఇంట్లో ఎలా ఉండేది….స్కూల్ లో ఎలాఉండేది అనే అంశాలపై ఆరా తీశారు.  బాలిక గతంలో ఒక డ్యాన్స్ స్కూల్ లో కూచిపూడి నృత్యం నేర్చుకునేది. డ్యాన్స్ నేర్చుకోవటం తనకి ఇష్టంలేకపోయినా ఇంట్లో పెద్దవాళ్ళ కోరిక మేరకు తాను డ్యాన్స్ క్లాస్ లకు వెళ్లేది. ఇష్టం లేకున్నా తల్లి తండ్రుల బలవంతం మీద వెళ్తుండేది.

Also Read : Cheetah Attack On Lion : సింహాన్ని పరుగు పెట్టించిన చిరుతపులి

కరోనా కారణంగా ఆన్ లైన్ క్లాసులకు హాజరయ్యేది. కొంతకాలం విరామం తర్వాత మంగళవారం నుంచి డ్యాన్స్ క్లాసులు తిరిగి ప్రారంభం అవుతున్నాయని తెలుసుకుని ఆందోళన చెందింది. క్లాసులకు వెళ్లటం ఇష్టం లేక మనోవేదనకు గురైంది. దీంతో మళ్లీ క్లాసులకు వెళ్ళటం ఇష్టంలేక సోమవారం రాత్రి ఇంట్లో అందరూ పడుకున్న సమయంలో బలవన్మరణానికి పాల్పడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు  నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహానికి మంగళవారం పోస్ట్‌మార్టం నిర్వహించి తల్లితండ్రులకు అప్పగించారు.