Protestors Set Fire : రగులుతున్న అమలాపురం.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు.. 3 బస్సులు దహనం

కోనసీమ జిల్లా పేరు మార్పు అగ్గిరాజేసింది. అమలాపురంలో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులు మంటల్లో తగలబడ్డాయి.(Protestors Set Fire)

Protestors Set Fire : రగులుతున్న అమలాపురం.. మంత్రి, ఎమ్మెల్యే ఇళ్లకు నిప్పు.. 3 బస్సులు దహనం

Protestors Set Fire

Protestors Set Fire : అమలాపురం అట్టుడుకుతోంది. కోనసీమ జిల్లా పేరు మార్పుని వ్యతిరేకిస్తూ చేపట్టిన ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. మంత్రి, ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులకు నిరసనకారులు నిప్పు పెట్టారు. మూడు బస్సులను తగలబెట్టారు. పోలీసు వాహనాలపై రాళ్ల దాడి చేశారు. ఈ దాడిలో పలువురు పోలీసులకు గాయాలయ్యాయి.

కోనసీమ జిల్లా పేరుని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఇటీవలే ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ ఇవ్వడం వివాదానికి దారి తీసింది. దీనిపై మొదలైన ఆందోళన తీవ్రరూపం దాల్చింది. అమలాపురంలో పోలీస్ ఆంక్షలు ఉల్లంఘించి వేలాది మంది రోడ్లపైకి వచ్చారు.

అన్నివైపుల నుంచి సుమారు 10వేల మంది ఆందోళనకారులు రోడ్డెక్కారు. పోలీసుల లాఠీచార్జితో అమలాపురంలో పరిస్థితి అదుపు తప్పింది. ఆందోళనకారులు రెచ్చిపోయారు. ప్రభుత్వ వాహనాలు, భవనాలను టార్గెట్ చేశారు. మూడు ఆర్టీసీ బస్సులను తగులబెట్టారు. మంత్రి విశ్వరూప్ క్యాంప్ ఆఫీస్, ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్ క్యాంప్ ఆఫీసులకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు.(Protestors Set Fire)

Konaseema Tension : అమలాపురం లో ఉద్రిక్తత-పేరు మార్పుపై రెచ్చిపోయిన ఆందోళనకారులు

కోనసీమ ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. జిల్లాలో రెండు వర్గాలు ఉన్నాయి. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ జిల్లా పేరు పెట్టాలని ఓ వర్గం, కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరు పెట్టకూడదని మరో వర్గం డిమాండ్ చేస్తోంది.

సాయంత్రం 4గంటల 45 నిమిషాల సమయంలో ఆందోళనకారులు ప్రభుత్వ వాహనాలు, ఆఫీసులకు నిప్పంటించారు. సాయంత్రం 5 గంటల 15 నిమిషాల సమయంలో మంత్రి విశ్వరూప్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. ఉదయం నుంచి ప్రశాంతంగా ఉంది. మధ్యాహ్నం నుంచి విధ్వంసం మొదలైంది. పోలీసులు ఊహించని విధంగా ఆందోళనలు జరిగాయి. ఉదయం నుంచి అంతగా హడావుడి చేయని ఆందోళనకారులు మధ్యాహ్నం మూడున్నర సమయంలో ఒక్కసారిగా రోడ్డెక్కారు. అన్నివైపుల నుంచి సుమారు 10వేల మంది ఆందోళనకారులు రోడ్డెక్కారు. ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. దీంతో ఒక్కసారిగా పరిస్థితి అదుపు తప్పింది.(Protestors Set Fire)

Tension In Amalapuram : అట్టుడుకుతున్న అమలాపురం.. మంత్రి క్యాంప్ ఆఫీస్, బస్సుకు నిప్పు.. పోలీసులపై రాళ్ల దాడి

సెక్షన్ 144, 30 పోలీస్ యాక్ట్ అమల్లో ఉందని, నిరసనకారులు రోడ్డుపైకి రావద్దని ఉదయం నుంచి పోలీసులు ప్రచారం చేశారు. అయితే మధ్యాహ్నం 3 గంటల తర్వాత ఒక్కసారిగా వేలాది మంది వివిధ ప్రాంతాల నుంచి ప్రధాన రహదారి మీదకు రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కలెక్టర్ ఆఫీసు వైపు ఆందోళనకారులు వెళ్లకుండా పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. జై కోనసీమ నినాదాలతో వందల మంది కలెక్టర్ కార్యాలయానికి చేరుకున్నారు.

కోనసీమ జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో ఈ నిరసనలు జరిగాయి. ”కోనసీమ జిల్లా ముద్దు.. వేరే పేరు వద్దు” అంటూ యువకులు నినాదాలతో హోరెత్తించారు. కొంతమంది యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జిల్లా ఎస్పీ క్షేత్రస్థాయికి వెళ్లి పరిస్థితులను సమీక్షించారు. అమలాపురం ఏరియా ఆస్పత్రి పరిసరాల్లో పోలీసులపై కొందరు యువకులు రాళ్ల దాడి చేశారు.

Pawan on Amalapuram: అమలాపురం ఉద్రిక్తతలపై స్పందించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్

అమలాపురం బ్యాంకు కాలనీలోని మంత్రి విశ్వరూప్ క్యాంప్ ఆఫీస్ కి ఆందోళనకారులు నిప్పుపెట్టారు. మంత్రి క్యాంపు కార్యాలయంలోని ఫర్నీచర్, అద్దాలు ధ్వంసం చేశారు. ఈ దాడికి ముందే మంత్రి కుటుంబ సభ్యులను పోలీసులు అక్కడి నుంచి తరలించారు. మరోవైపు వైసీపీ జిల్లా అధ్యక్షుడు, ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ క్యాంప్ ఆఫీసుకి కూడా నిరసనకారులు నిప్పు పెట్టారు.(Protestors Set Fire)

అమలాపురంలో ఆందోళనలపై రాష్ట్ర హోం మంత్రి తానేటి వనిత స్పందించారు. అంబేద్కర్ పేరు జిల్లాకు పెడితే వ్యతిరేకించడం బాధాకరం అన్నారు. జిల్లా ప్రజల విజ్ఞప్తుల మేరకే జిల్లా పేరును అంబేడ్కర్ కోనసీమ జిల్లాగా మార్చామని ఆమె వివరించారు. ఆందోళనకారులను కొందరు వెనకుండి నడిపిస్తున్నారని మంత్రి ఆరోపించారు. విచారణ అనంతరం నిందితులపై చర్యలు తీసుకుంటామన్నారు. 20 మందికి పైగా పోలీసులపై రాళ్లు రువ్వి గాయపరిచారని, స్కూల్ బస్సులను కూడా తగులబెట్టారని హోంమంత్రి తెలిపారు. ఆందోళనకారులను, వారి వెనుక ఉండి నడిపించే వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు సూచించామన్నారు.(Protestors Set Fire)

దళిత సంఘాల నుంచి ఒత్తిడి రావడంతో కోనసీమ జిల్లా పేరును బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాగా మారుస్తూ ఇటీవలే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం వివాదానికి దారితీసింది. మరో వర్గం దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఆందోళనలకు పిలుపునిచ్చింది. కోనసీమ జిల్లా పేరుని కొనసాగించాలని ఆ వర్గం డిమాండ్ చేస్తోంది.