Tirupati Gangamma Jathara: చాటింపుతో వైభవంగా ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర.. వేరే ఊరోళ్లు రాత్రి ఉండొద్దు..

చాటింపుతో మొదలైన గంగమ్మ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. బుధవారం బైరాగి వేషం‌లో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు.

Tirupati Gangamma Jathara: చాటింపుతో వైభవంగా ప్రారంభమైన తిరుపతి గంగమ్మ జాతర.. వేరే ఊరోళ్లు రాత్రి ఉండొద్దు..

Tirupati Gangamma Jathara

Tirupati Gangamma Jathara: ఏపీలో జరిగే జాతరల్లో తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ జాతర ఒకటి. గంగమ్మ ఆలయంలో స్థానిక సాంప్రదాయాల ప్రకారం జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరలో భాగంగా తిరుపతి గ్రామదేవత (గ్రామాన్ని చూసే దేవత)గా భావించే గంగమ్మ దేవతకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మంగళవారం అర్థరాత్రి చాటింపుతో తిరుపతి గ్రామ దేవతగా పిలుచుకొనే చిన్నగంగమ్మ జాతర వేడుకగా ప్రారంభమైంది. బుధవారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఈ జాతర జరుగుతుంది.

Gangamma Jatara : తిరుపతిలో గంగమ్మ జాతర ప్రారంభం

చాటింపుతో మొదలైన గంగమ్మ జాతరకు భారీ సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు. మంగళవారం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా బుధవారం ఉదయం 8గంటలకు ఆలయ ఆవరణలోనున్న అమ్మవారి విశ్వరూప కొడిస్తంభానికి అర్చకులు అభిషేకం చేసిన అనంతరం కొడి స్తంభానికి ఒడిబాలు సమర్పించారు. గంగ జాతరలో భాగంగా ఇవాళ (బుధవారం) బైరాగి వేషం‌లో భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తాతయ్యగుంట గంగమ్మకు బుధవారం ఉదయం తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి సారె సమర్పించారు. ఈ జాతరకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు.

TTD Fake Website : మరో నకిలీ వెబ్ సైట్ ను గుర్తించిన టీటీడీ

ఈ జాతరకు ఒక ప్రత్యేక ఉంది. వారం రోజుల పాటు జరిగే ఈ జాతర నేపథ్యంలో గ్రామస్తులు ఊరును విడిచి వెళ్లరాదు. ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారు రాత్రిపూట ఇక్కడ బస చేయకుండా వెళ్లిపోవాలి. జాతర ప్రారంభం కావడంతో అమ్మవారి అనుగ్రహం పొందేందుకు పూజలు నిర్వహించాలి.. ఇలా సంప్రదాయాల ప్రకారం కైకాల వంశస్తులు తిరుపతి గంగజాతర సందర్భంగా మంగళవారం గ్రామంలో చాటింపు వేశారు. అనంతరం భేరి వీధిలో తొలి చాటింపు పూజ నిర్వహించి నాటి నగర శివారు ప్రాంతాలలో అష్టదిగ్భంధనం చేసి చాటింపుతో జాతరకు శ్రీకారం చుట్టారు.