Sajjala Ramakrishnareddy : కేంద్రం సెస్ లు తగ్గించుకుంటే రూ.40లకే పెట్రోల్ : సజ్జల

కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. కేంద్రం సెస్ లు అన్ని తగ్గించుకుంటే 40 నుండి 50 రూపాయలకే పెట్రోల్ వస్తుందని తెలిపారు.

Sajjala Ramakrishnareddy : కేంద్రం సెస్ లు తగ్గించుకుంటే రూ.40లకే పెట్రోల్ : సజ్జల

Sajjala

Sajjala criticism central government : కేంద్ర ప్రభుత్వంపై వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శలు చేశారు. కేంద్రం సెస్ లు అన్ని తగ్గించుకుంటే 40 నుండి 50 రూపాయలకే పెట్రోల్ వస్తుందని తెలిపారు. కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీ ఇక్కడ తగ్గించాలని ధర్నాలు ఏంటని ప్రశ్నించారు. తాము ఇచ్చిన పేపర్ ప్రకటనలో ఏదైనా అవాస్తవం ఉందా చెప్పాలన్నారు. తగ్గించింది తక్కువ.. రాష్ట్రాల నుండి వసూల్ చేస్తున్నది ఎక్కువ అని అన్నారు. వసూల్ చేసే మొత్తం ఎక్సైజ్ డ్యూటీ కిందికి తీసుకురావాలని.. అప్పుడు రాష్ట్రాలు కూడా తగ్గిస్తాయని చెప్పారు.

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కడా అక్రమాలు జరగడంలేదు.. అంతా సవ్యంగా జరుగుతుందన్నారు. చంద్రబాబు చేతకాని తనంతో దొంగ ఏడుపులు ఏడుస్తున్నాడని మండిపడ్డారు. వ్యవస్థ ఎప్పుడూ ఒకే విధంగా ఉంటుంది.. తన అభ్యర్థులతో సంతకాలు చేయించడం సాధ్యమా..? అని ప్రశ్నించారు.
గెలవలేననే భయంతో ఉన్నవాడు ఇలాంటి సాకులు చెప్తారని తెలిపారు. అనంతపురం విద్యార్థులపై లాఠీ ఛార్జ్ అని తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ ప్రభుత్వంలో అలాంటి వాటికి ఆస్కారం ఉండదని స్పష్టం చేశారు.

Telangana : గౌడ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాలు కేటాయింపు

దెబ్బ తగిలిన అమ్మాయి జనం నుండి వచ్చిందని చూసినవాళ్ళు చెబుతున్నారు..ఆ అమ్మాయితో లోకేష్ ఫోన్ లో మాట్లాడించారని పేర్కొన్నారు. అక్కడ ఘటనలో బయటి నుండి వచ్చిన శక్తులు ఉన్నారని తెలిపారు. రాజకీయ ప్రయోజనాల కోసం విద్యార్థుల భవిష్యత్ తో ఆడుకుంటున్నారని ఫైర్ అయ్యారు.
ఎయిడెడ్ స్కూల్స్ విషయంలో చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. ఎక్కడా బలవంతం చెయ్యడం లేదన్నారు. 2 వేల స్కూల్స్ కి.. 702 కు ఉన్న విధంగానే కొనసాగుతున్నాయని చెప్పారు. 1446 స్కూల్స్ టీచర్లను ప్రభుత్వానికి ఇచ్చారని పేర్కొన్నారు. 101 టోటల్ ప్రభుత్వానికి ఇవ్వడానికి అంగీకరించారని తెలిపారు.

ఈ రెండేళ్లలో ప్రభుత్వ స్కూల్స్ గణనీయంగా బలోపేతం అయ్యాయని స్పష్టం చేశారు. ఇద్దరు సీఎంల సమావేశం తరువాత రెండు రాష్ట్రాల సమస్యలు పరిష్కారం అవుతాయని పేర్కొన్నారు. మొత్తం 14 ఎమ్మెల్సీ స్థానాలు తమకే వస్తాయని.. సామాజిక న్యాయం పాటిస్తామని చెప్పారు. మొత్తం సభలో సామాజిక న్యాయం ఉండే విధంగా ఎంపిక ఉంటుందని స్పష్టం చేశారు.