Nara Lokesh- Katasani : సింగిల్‌గా రమ్మనా ఓకే.. మందితో రమ్మన్నా ఓకే..చర్చకు రెడీ : లోకేశ్‌కు కాటసాని సవాల్

అవినీతి ఆరోపణలపై సాక్ష్యాధారాలతో సహా లోకేశ్ నిరూపిస్తానంటున్నాడు కదా..నేను రెడీ నిరూపించమనండి.నేను అవినీతికి పాల్పడుతున్నానని రాజీనామా చేయమడి అంటున్నారుగా..నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా ఎందుకు... నేను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా అని అన్నారు.భవిష్యత్తులో ఎప్పుడు..ఎక్కడ కూడా పోటీ చేయను,రాజకీయలలో ఉండనని స్పష్టంచేశారు కాటసాని.

Nara Lokesh- Katasani : సింగిల్‌గా రమ్మనా ఓకే.. మందితో రమ్మన్నా ఓకే..చర్చకు రెడీ : లోకేశ్‌కు కాటసాని సవాల్

MLA Katasani Rambhupal Reddy Challenge To Nara Lokesh

Nara Lokesh- Katasani : సింగిల్ గా రమ్మంటే వస్తా… లేదా మందీ మార్బలంతో రమ్మంటే వస్తా నువ్వు నాపై చేసిన ఆరోపణల్ని నిరూపిస్తావా? నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటా అంటూ నారా లోకేశ్ కు సవాల్ విసిరారు ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి. చేత కానీ వాడు మాటలు మాట్లాడటం ఎక్కువ చేతనైన వాడు సైలెంట్ గా ఉంటాడు అంటూ లోకేశ్ పై సెటైర్లు వేశారు కాటసాని.

కాగా..యువగళం పాదయాత్రలో టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ వైసీపీ నేతలపై ఘాటు విమర్శలు సంధిస్తున్నారు. ఏ ప్రాంతంలో పాదయాత్ర కొనసాగితే ఆ స్థానిక నేతలపై ఆరోపణలు చేస్తున్నారు. అవినీతి, భూకబ్జాలు, ఇసుక దందాలు అంటూ లోకేశ్ చేస్తున్న విమర్శలపై తీవ్రంగా మండిపడ్డుతున్నారు వైసీపీ నేతలు. దీంతో లోకేశ్ చేసే ఆరోపణలపై సవాళ్లు విసురుతున్నారు వైసీపీ నేతలు. దీంట్లో భాగంగానే లోకేశ్ తనపై చేసిన ఆరోపణలసై కాటసాని స్పందించారు. లోకేశ్ కు సవాల్ విసిరారు. ‘నాపై ఆరోపణలు చేసే నారా లోకేష్.. నీకు విజ్ఞప్తి చేస్తున్నా నీకు చేతనైతే… నీకు దమ్ము ధైర్యం ఉంటే..నీవు పెద్ద లీడర్ అని ఊహించుకుంటూన్నావు అంత లేదు నీకు..నా స్ధాయి మీతో మాట్లాడే స్థాయి కాదు’ అంటూ సవాల్ విసిరారు.

MLA Hafeez Khan : ఖురాన్ పట్టుకుని కర్నూల్‌లో లోకేశ్ కోసం వేచి చూస్తున్న ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ .. ఆరోపణల్ని నిరూపించాలని సవాల్

ఈ సందర్బంగా కాటసాని నారా లోకేష్ ను చర్చకు కూర్చోబెట్టండి అంటూ టీడీపీ నేతలకు సవాల్ విసిరారు. అవినీతి ఆరోపణలపై సాక్ష్యాధారాలతో సహా లోకేశ్ నిరూపిస్తానంటున్నాడు కదా..నేను రెడీ నిరూపించమనండి అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. నేను అవినీతికి పాల్పడుతున్నానని రాజీనామా చేయమడి అంటున్నారుగా..నాపై చేసిన ఆరోపణలు నిరూపిస్తే రాజీనామా ఎందుకు… నేను శాశ్వతంగా రాజకీయాలను వదిలేస్తా అని అన్నారు.భవిష్యత్తులో ఎప్పుడు..ఎక్కడ కూడా పోటీ చేయను,రాజకీయలలో ఉండనని స్పష్టంచేశారు కాటసాని.

మీ నాయకుడు చంద్రబాబుతోనైనా… లోకేష్ తోనైనా మాట్లాడించండి నేను చర్చకు రెడీగా ఉన్నానని ప్రకటించారు. చర్చకి మీ చంద్రబాబు నాయుడు పిలిపించండి నేను సిద్ధంగా ఉన్నానని కర్నూలు జిల్లాలో ఆరోపణలు చేశారు కనుక ప్రజల మధ్యలో చర్చించిన అనంతరం యాగంటి దేవాలయం దగ్గరకు వెళ్లి ప్రమాణం చేద్దాం అని సవాల్ విసిరారు.నేను ఎక్కడ అవినీతి పాల్పడలేదని రైతుల నుండి డబ్బులు తీసుకోలేదని ప్రమాణం చేస్తా. నాతో పాటు ప్రభాకర్ రెడ్డి అనే వ్యక్తికాని ప్రమాణం చేస్తారు.మీకు ధైర్యం ఉంటే మీకు టాలెంట్ ఉంటే నారా లోకేష్ తో బహిరంగ చర్చకు ఒప్పించండి.రేపు సాయంత్రం లోగా ఒప్పించండీ. నారా లోకేష్ పాదయాత్రలో బిజీగా ఉంటే చంద్రబాబు నాయుడిని ఒప్పించి చర్చకు రమ్మనండి.నారా లోకేష్ ఏవిధంగా కోరుకుంటే ఆ విధంగా రావడానికి సిద్ధం సింగల్ గా రమ్మంటే సింగల్ గా వస్తా ఐదు మందితో రమ్మంటే ఐదు మందితో వస్తా లేదు ఎక్కువమందితో రమ్మంటే ఎక్కువ మందితో వస్తా చర్చించడానికి టైం చెప్పండి లేకుంటే నోరు మూసుకొని కూర్చుంటే మంచిది. అంటూ విరుచుపడ్డారు కాటసాని.

Paritala Sriram : గుర్రాల కోట కేతిరెడ్డీ కూల్‌గా ఉంటే నీకే మంచిది: వైసీపీ ఎమ్మెల్యేకు పరిటాల శ్రీరామ్ స్ట్రాంగ్ కౌంటర్