Home » Author »bheemraj
ప్రధానమంత్రి మాతృమూర్తి హీరాబెన్ (100) కన్నుమూశారు. తన తల్లి మృతి పట్ల ప్రధాని మోదీ భావోద్వేగ ట్వీట్ చేశారు. అమ్మ భగవంతుడి చెంతకు చేరిందంటూ భావోద్వేగంగా ట్వీట్ చేశారు.
బ్రెజిల్ సాకర్ దిగ్గజం, ఫుట్ బాల్ అత్యుత్తమ క్రీడాకారుడు పీలే (82) ఇక లేరు. అనారోగ్యం బాధపడుతూ ఇవాళ ఆయన కన్నుమూశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ పీలే మృతి చెందారు.
ప్రధాని మోదీకి మాతృ వియోగం కలిగింది. ప్రధాని మోదీ తల్లి హీరాబెన్(100) అనారోగ్యంతో కన్నుమూశారు. అహ్మదాబాద్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందారు.
జార్ఖండ్ లో నక్సల్స్ కీలక నేత, సీపీఐ మావోయిస్టు ఆర్గనైజర్ రీజనల్ కమాండర్ అమన్ గంఝు ఇవాళ జార్ఖండ్ పోలీసు, సీఆర్పీఎఫ్ ఉన్నతాధికారుల ఎదుట లొంగిపోయారు. అమన్ గంఝు తలపై రూ.19 లక్షల రివార్డు ఉంది.
పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడు ఫుల్ గా మద్యం తాగి స్కూల్ కు వచ్చాడు. మద్యం మత్తులో క్లాస్ రూమ్ లో నేలపైనే నిద్రపోయాడు. స్కూల్ సిబ్బంది, విద్యార్థులు ఎంత లేపినా లేవలేదు.
తెలంగాణలో కొలువుల జాతర నెలకొంది. రాష్ట్రంలో వరుసుగా ఉద్యోగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు జారీ అయ్యాయి. తాజాగా మరో రెండు శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది.
ఓ వ్యక్తి గన్ తో నాగు పాముపై కాల్పులు జరిపాడు. ఆగ్రహించిన ఆ పాము ఏం చేసిందో చూస్తే భయపడాల్సిందే. ఒక వ్యక్తి కారులో వెళ్తుండగా కచ్చా రోడ్డుపై ఒక నాగు పాము కనిపించింది. దీంతో అతడు తన వాహనాన్ని ఆపాడు. ఆ పామును కవ్విచేందుకు ప్రయత్నించాడు.
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు జడ్జిమెంట్ సమయంలో తెలంగాణ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం ముమ్మాటికి తప్పేనని హైకోర్టు వ్యాఖ్యానించింది. ముఖ్యమంత్రికి సాక్షాలు ఎవరిచ్చారో చెప్పడంలో సిట్ విఫలం అయిందని హైకోర్టు పే�
ఏపీ ముఖ్యమంత్రి జగన్ కు జనసేనాని పవన్ కళ్యాణ్ బహిరంగంగా లేఖ రాశారు. సామాజిక పింఛన్ల తొలగింపు దిశగా జారీ చేస్తున్న నోటీసులను జనసేనాని తప్పు పట్టారు. విద్యుత్ బిల్లు పెరిగిందనో, ఇంటి విస్తీర్ణం ఎక్కువైందనో రద్దు చేయాలని చూడడం విచిత్రంగా ఉంద�
మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో సిబ్బంది నిర్లక్ష్యంతో గందరగోళం చెలరేగింది. ఆస్పత్రి సిబ్బంది అత్యుత్సాహం వల్ల ఒకే రోజు పుట్టిన ఇద్దరు శిశువులు తారుమారు అయ్యారు. దీంతో బాలింతల కుటుంబ సభ్యులు ఆస్పత్రి తీరును నిరసిస్తూ ఆందోళన చేపట్టారు.
టిక్ టాక్ పై అమెరికా నిషేధం విధించింది. టిక్ టాక్ యాప్ ను తమ చట్టసభల డివైజ్ ల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. అయితే దేశం మొత్తం కాకుండా కేవలం అమెరికా ప్రభుత్వ డివైజ్ లలో మాత్రమే వినియోగించకూడదని సూచించింది.
భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. కరోనా కట్టడికి అంతర్జాతీయ ప్రయాణికులకు ఎయిర్ పోర్టుల్లో కరోనా పరీక్షలు నిర్వహిస్తోంది. గత రెండు రోజుల్లో భారత్ కు వచ్చిన 39 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా వైరస్ వ్యాపించిందని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
తెలంగాణలో విద్యుత్ వినియోగం భారీగా పెరిగింది. రాష్ట్రంలో డిసెంబర్ 13 వేల మెగావాట్లకు పైగా విద్యుత్ ను వినియోగించినట్లు అధికారులు పేర్కొన్నారు.
రష్యా చట్ట సభ ప్రతినిధి పావెల్ ఆంటోవ్ భారత్ లో మృతి చెందారు. ఒడిశాలోని ఓ హోటల్ లో అనుమానాస్పద స్థితిలో మరణించారు. తన 65వ పుట్టిన రోజు జరుపుకునేందుకు పావెల్ ఇండియాలో పర్యటిస్తున్నారు.
చైనాలో కరోనా మళ్లీ విలయతాండబం చేస్తోంది. రోజుకు లక్షల్లో కేసులు నమోదుకావడం ఆందోళన కల్గిస్తోంది. భారత్ లోనూ కరోనా కేసులు స్వల్పంగా పెరుగుతున్నాయి. దేశంలో కొత్తగా 157 కరోనా కేసులు నమోదు కాగా, ఒకరు మృతి చెందారు.
అమెరికా, జపాన్ లో మంచు తుపాను బీభత్సం సృష్టిస్తోంది. తీవ్ర మంచు తుపాను తుపాను ధాటికి అమెరికాలో 60, జపాన్ లో 17 మంది మృత్యువాతపడ్డారు. యూఎస్ లో గుట్టలు గుట్టలుగా మంచు పేరుకుపోయింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
తెలంగాణ ఆర్టీసీ ప్రయాణికులకు బంపర్ ఆఫర్ ప్రకటించింది. సంక్రాంతికి ఊరెళ్లే ప్రయాణికులు రాను పోను ఒకేసారి టికెట్లు బుకింగ్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ కల్పిస్తున్నట్లు ప్రకటించింది.
అమెరికాలోని వాషింగ్టన్ యూనివర్సిటీ పరిశోధకులు అల్జీమర్స్ ను ముందే గుర్తించే రక్త పరీక్షను కనుగొన్నారు. మెదడులో అమిలాయిడ్ బీటా అనే ప్రొటీన్లు అస్తవ్యవస్థంగా ఒకదానిపై మరొకటి ముడుచుకుపోయి ఒలిగోమర్స్ ను ఏర్పరుస్తామని తెలిపారు.
హైదరాబాద్ నగర శివారులో దట్టమైన పొగమంచు కమ్ముకుంది. శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టును పొగమంచు కమ్మేసింది. దీంతో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.
రాజన్నసిరిసిల్ల జిల్లా విద్యుత్ సహకార సంఘం ఎన్నికల్లో బీఆర్ఎస్ హవా కొనసాగింది. 15 స్థానాల్లో గులాబీ జెండా రెపరెపలాడింది. 15 డైరెక్టర్ స్థానాల్లోనూ బీఆర్ఎస్ బలపరిచిన అభ్యర్థులు విజయం సాధించారు.