Heroin Seized In Gujarat Port : గుజరాత్ పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

రూ.21 వేల కోట్లు విలువ చేసే 3,000 కిలోల హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ అండ్ ఇంటిలిజెన్స్ అధికారులు పోర్టులో నిలిపి ఉంచిన 2 కంటైనర్ల నుండి స్వాధీనం చేసుకున్నారు.

Heroin Seized In Gujarat Port : గుజరాత్ పోర్టులో రూ.21వేల కోట్ల విలువైన హెరాయిన్ స్వాధీనం

Gujarat Drugs Case

Heroin Seized In Gujarat Port : గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో అధికారులు పెద్ద ఎత్తున మాదక ద్రవ్యాలను స్వాధీన పరుచుకోవటం కలకలం రేపింది. రూ.21 వేల కోట్లు విలువ చేసే 3,000 కిలోల హెరాయిన్ ను డైరెక్టరేట్ ఆఫ్ రెవిన్యూ అండ్ ఇంటిలిజెన్స్ అధికారులు పోర్టులో నిలిపి ఉంచిన 2 కంటైనర్ల నుండి స్వాధీనం చేసుకున్నారు. ఇటీవలి కాలంలో ఇంత పెద్ద మొత్తంలో మాదక ద్రవ్యాలు పట్టుబడడం ఇదే మొదటిసారని అధికారులు తెలిపారు.

తాలిబన్ల పాలనలో ఉన్న అప్ఘానిస్తాన్ నుంచి, ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు ద్వారా, మాదక ద్రవ్యాలు గుజరాత్‌కు చేరుకున్నట్లు అధికారులు గుర్తించారు. అఫ్ఘనిస్తాన్ నుంచి బయలుదేరిన నావ సెప్టెంబర్ 13,14 తేదీల్లో ఇరాన్‌లోని బందర్ అబ్బాస్ పోర్టు ద్వారా గుజరాత్ కు చేరుకుంది.  వీటిని ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఒక సంస్ధ టాల్కమ్ పౌడర్ పేరుతో దిగుమతి చేసుకుంది.

ఈ కేసులో చెన్నైకు చెందిన ఒక జంటను పోలీసులు అరెస్ట్ చేశారు. ఢిల్లీలో ఉన్న అనుమానిత అఫ్ఘాన్ జాతీయులను నిఘా సంస్ధలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. మాదకద్రవ్యాల రవాణాకు…తాలిబన్, ఐఎస్ఐల మధ్య ఉన్న లింక్ కోసం తీవ్రంగా విచారణ జరుపుతున్నామని దర్యాప్తు సంస్ధల అధికారు ఒకరు చెప్పారు.

సెప్టెంబర్ 16,17 తేదీల్లో డీఆర్ఐ కందహార్‌కు చెందిన కంపెనీ ఎగుమతి చేసిన కంటైనర్‌ను పరిశీలించింది. అందులో రెండు సంచుల్లో నిల్వ చేసిన 1,999.58 కిలోల హెరాయిన్ ను, ఒక బ్యాగులో ఉన్న 988.64 కిలోల హెరాయిన్ ను స్వాధీనం చేసుకున్నారు. కస్టమ్స్, డీఆర్ఐ అధికారులు గుర్తు పట్టకుండా ఉండేందుకు వీటిని టాల్కం పౌడర్  పార్సిళ్ల మధ్య ఉంచి రవాణా చేస్తున్నట్లు గుర్తించారు.

గాంధీనగర్‌లోని సెంట్రల్ పోరెన్సిక్   లేబోరేటరీలో పరీక్షలు నిర్వహించగా… అప్ఘనిస్తాన్‌లో పండించే నాణ్యమైన హెరాయిన్‌గా తేల్చారు. అంతర్జాతీయ మార్కెట్లో దీని విలువ సుమారు .7 కోట్ల పైమాటే ఉఁటుందని వారు తెలిపారు. హెరాయిన్ పట్టుబడిన తర్వాత గుజరాత్, ఢిల్లీ, ఆంధ్రప్రదేశ్ లోని పలు పట్టణాల్లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అనేక మంది అనుమానిత అప్ఘాన్ పౌరులను అదుపులోకి తీసుకున్నారు. స్మగ్లర్లతో వారికి గల లింకుల గురించి ప్రశ్నిస్తున్నారు.

భారత వ్యతిరేక పాకిస్తాన్, తాలిబన్, ఉగ్రవాదులు తమ కార్యకలాపాల కోసం,  ఆర్ధికంగా నిల దొక్కుకోటానికి….నిబంధనలు ఉల్లంఘించి భారత్‌లోకి మాదక ద్రవ్యాలను ప్రవేశ పెట్టాలని చూస్తున్నాయని నిఘా సంస్ధలు వెల్లడించాయి. ఆగస్టు15న కాబూల్‌ను తాలిబన్లు వశపరుచుకున్న తర్వాత భారతదేశంలో మాదక ద్రవ్యాల సరఫరా, విదేశీ ఉగ్రవాదుల చొరబాటు… ఉగ్రవాద కార్యకలాపాల అంశాలను రెండు దేశాల కేంద్ర ఏజెన్సీలు పలు మార్లు చర్చలు జరిపాయి.

తాలిబాన్ మరియు ఇస్లామిక్ స్టేట్ ఖోరాసన్ ప్రావిన్స్ (ISKP) రెండింటికి ప్రధాన వనరుగా ఉన్న టాల్క్ం పౌడర్ ఎగుమతిని ఆఫ్ఘనిస్తాన్ ప్రభుత్వం 2015 లోనే నిషేధించింది. ఇప్పుడు అంతర్జాతీయంగా పెద్ద మొత్తంలో హెరాయిన్  పట్టుబడటంతో ఈ కేసులో మరికొంతమందిని అరెస్టు చేసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.