Man To 20 Years In Prison : బాలికపై అత్యాచారం చేసిన వ్యక్తికి 20 ఏళ్ల జైలు శిక్ష.. థానే కోర్టు కీలక తీర్పు
మహారాష్ట్రలో థానే జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జిల్లా అదనపు సెషన్స్ జడ్జి పీఆర్ ఆశుతుర్కార్ ఈ కేసులో తీర్పును వెలువరించారు.

Man To 20 Years In Prison : మహారాష్ట్రలో థానే జిల్లా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జిల్లా అదనపు సెషన్స్ జడ్జి పీఆర్ ఆశుతుర్కార్ ఈ కేసులో తీర్పును వెలువరించారు. ఐపీసీ, పోక్సో చట్టం కింద దోషిని శిక్షించారు.
20 ఏళ్ల జైలు శిక్షతో పాటు 30వేల జరిమానా కూడా విధించారు. అక్టోబర్ 1వ తేదీన ఈ ఆదేశాలను జారీ చేశారు. కానీ తీర్పు కాపీని శుక్రవారం విడుదల చేశారు. బాధితురాలి సోదరుడికి నిందితుడు స్నేహితుడని ప్రాసిక్యూటర్లు వాదించారు. 2015, జనవరి 15వ తేదీ అత్యాచార ఘటన జరిగింది.
నెల రోజులపాటు ఆ వ్యక్తి బాలికను రేప్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కేసు విచారణ కొనసాగుతున్న సమయంలోనే ఆ అమ్మాయి శిశువుకు జన్మనిచ్చింది. బాధితురాలిని ఆదుకోవాలని జడ్జి ప్రభుత్వాన్ని కోరారు.