హీరోయిన్ కు బెదిరింపులు-నలుగురు అరెస్ట్ 

హీరోయిన్ కు బెదిరింపులు-నలుగురు అరెస్ట్ 

“అవును” సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన  హీరోయిన్ పూర్ణ. సోషల్ మీడియాలో ఆమెపై అసభ్యంగా పోస్టులు పెడుతూ ఆమెను బెదిరించిన నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేశారు. పూర్ణ అసలు పేరు షామ్నాకాశిం. ఆమె పుట్టింది, పెరిగింది, చదివింది అంతా కేరళలోనే. ఈ కేరళ కుట్టి 2007 లో వచ్చిన శ్రీ మహాలక్ష్మితో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అల్లరి నరేష్ తో సీమటపాకాయ్  చిత్రం చేసింది.

poorna allari naresh

అవును2, రాజగారి గది2 వంటి చిత్రాల్లోనూ పూర్ణ ప్రత్యేక పాత్రలు పోషించింది.  ఒకానొక సమయంలో  దెయ్యం సినిమాలుతీయాలంటే  నిర్మాతలు ఆమెనే ఎప్రోచ్ అయ్యేవారు. అంతలా ఆమె పేరు తెచ్చుకుంది. వరుసపెట్టి అన్నీ దెయ్యం పాత్రలేరావటంతో ఆమె వాటికిఫుల్ స్టాప్ పెట్టింది. ఇటీవల సినిమాలు  లేకపోవటం, లాక్ డౌన్ కారణంగా తన సొంతఊరు కోచిలో ఉంటోంది.  అక్కడ కొన్ని మళయాళ సినిమాలకు సైన్ చేసింది. ఈ లోగా ఆమెకు పెళ్ళి చేసే పనిలో పడ్డారు ఇంట్లో పెద్దవాళ్లు.

poorna avunu2

ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో నలుగురు వ్యక్తులు ఆమెను  సోషల్ మీడియా వేదికగా వేధించసాగారు.  సోషల్ మీడియాలో అసభ్యకరమైన పోస్టులు పెడుతూ తాము అడిగినంత డబ్బు ఇవ్వాలని  డిమాండ్ చేయటం ప్రారంభించారు. మొదట్లో అకతాయిల పనిగా భావించి  చూసీ చూడనట్లు ఉన్నప్పటికీ రాను రానూ వారి ఆగడాలు శృతి మించటంతో కుటుంబ సభ్యుల సహకారంతో ఆమె   సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించింది.

poorna hot 9

 

కేసునమోదు చేసుకున్న పోలీసులు  ఆ పోస్టులు బెంగుళూరు నుంచి అప్ లోడ్ అయినట్లు గుర్తించి స్ధానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. రంగంలోకి దిగిన బెంగుళూరు పోలీసులు  విచారణ జరిపి నిందితులు….అష్రఫ్, రఫీఖ్, శరత్, రమేశ్ లను అరెస్టు చేసి రిమాండ్ కు పంపారు. గతంలో కూడా ఈ నలుగురు  పలువురు సెలబ్రిటీలను బెదిరించి ఇలాగే డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
poorna 2

 

ఇటీవల వీరు నలుగురు పూర్ణకు పెళ్లి సంబంధం తీసుకొచ్చామనే నెపంతో ఆమె ఇంటికి వచ్చినట్టుగా సమాచారం. వారిది కోజికోడ్ అని, పెళ్లి కుమారుడి కుటుంబ సభ్యులమని నిందితులు పూర్ణ కుటుంబ సభ్యులకు చెప్పారు. ఆ తర్వాత వారు పూర్ణకు ఫోన్‌ చేసి లక్ష రూపాయలు డిమాండ్‌ చేశారు. లేకపోతే ఆమె కేరీర్‌ను నాశనం చేస్తానని బెదిరించారు.

shamna kasim

తొలుత డ్యాన్సర్‌గా, మోడల్‌గా కేరీర్‌ ప్రారంభించిన పూర్ణ.. ఆ తర్వాత వెండితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. దక్షిణాదిన పలు చిత్రాల్లో నటించిన పూర్ణ హీరోయిన్‌గానే కాకుండా క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే..పూర్ణ మరోవైపు పలు రియాల్టి షోలకు జడ్జిగా వ్యవహరిస్తున్నారు.
shamna kassim

Read: బాకీ తీర్చమన్నందుకు, అప్పు ఇచ్చిన వ్యక్తి దారుణ హత్య