Gulf Agent Fraud : విదేశాల్లో ఉద్యోగాల పేరుతో గల్ఫ్‌ ఏజెంట్‌ మోసం.. యువకుల నుంచి రూ.లక్షలు వసూలు చేసి పరారీ

తెలంగాణలో గల్ఫ్‌ ఏజెంట్ల మోసం మరోసారి బయటపడింది. గల్ఫ్‌ దేశాలతో పాటు మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మాయలేడి.. పరారయ్యింది.

Gulf Agent Fraud : విదేశాల్లో ఉద్యోగాల పేరుతో గల్ఫ్‌ ఏజెంట్‌ మోసం.. యువకుల నుంచి రూ.లక్షలు వసూలు చేసి పరారీ

Gulf agent fraud

Gulf Agent Fraud : తెలంగాణలో గల్ఫ్‌ ఏజెంట్ల మోసం మరోసారి బయటపడింది. గల్ఫ్‌ దేశాలతో పాటు మలేషియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేసిన మాయలేడి.. పరారయ్యింది. విదేశాల్లో భారీ వేతనాలతో ఉద్యోగాలు ఇప్పిస్తానని పరిమళ అనే మహిళ.. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో ఆఫీస్‌ ఓపెన్‌ చేశారు.

సిద్దిపేట, ఆర్మూర్‌, నిజామాబాద్‌ ప్రాంతాలకు చెందిన యువకుల నుంచి లక్షల రూపాయలు వసూలు చేశారు. మలేషియా పంపిస్తానని టూరిస్ట్‌ వీసాలు చేతిలో పెట్టారు. కొద్దిరోజుల తర్వాత ఫ్లైట్‌ ఎక్కిస్తానని నమ్మించారు. నెల రోజులు గడుస్తున్నా.. మలేషియా పంపకపోవడంతో అనమానం వచ్చిన యువకులు మాయలేడీకి ఫోన్‌ చేసినా లిఫ్ట్‌ చేయలేదు.

Cyber Cheater : ఉద్యోగాల పేరుతో అమ్మాయిల్ని మోసం చేస్తున్న యువకుడు అరెస్టు

దీంతో అనుమానం వచ్చిన బాధితులు మేములవాడలోని కార్యాలయానికి చేరుకుంటే తాళం వేసింది ఉంది. దీంతో మోసాన్ని గ్రహించిన బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.