తన వద్దకు రావాలని వేధిస్తున్న వివాహిత : పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

సాధారణంగా  మగ వాళ్లు ఆడవాళ్లను టీజ్ చేయటమో...ప్రేమపేరుతో వెంటపడటం... ఇంకొంచెం   పరిచయం పెరిగాక కోరిక తీర్చమని వేధించటం..అది నచ్చకపోతే ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టటం ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటాం. కానీ...హైదరాబాద్  సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు  రివర్స్ తో కూడిన  కేసు  అందింది. వివాహిత వేధింపుల నుంచి రక్షింపమని వేడుకుంటూ ఒక యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

  • Published By: chvmurthy ,Published On : March 18, 2020 / 06:54 AM IST
తన వద్దకు రావాలని వేధిస్తున్న వివాహిత : పోలీసులను ఆశ్రయించిన బాధితుడు

సాధారణంగా  మగ వాళ్లు ఆడవాళ్లను టీజ్ చేయటమో…ప్రేమపేరుతో వెంటపడటం… ఇంకొంచెం   పరిచయం పెరిగాక కోరిక తీర్చమని వేధించటం..అది నచ్చకపోతే ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టటం ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటాం. కానీ…హైదరాబాద్  సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు  రివర్స్ తో కూడిన  కేసు  అందింది. వివాహిత వేధింపుల నుంచి రక్షింపమని వేడుకుంటూ ఒక యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.

సాధారణంగా  మగ వాళ్లు ఆడవాళ్లను టీజ్ చేయటమో…ప్రేమపేరుతో వెంటపడటం… ఇంకొంచెం   పరిచయం పెరిగాక కోరిక తీర్చమని వేధించటం..అది నచ్చకపోతే ఆడవాళ్ళు కంప్లైంట్ ఇస్తే కేసు పెట్టటం ఇలాంటి వార్తలు చూస్తూ ఉంటాం. కానీ మంగళవారం మార్చి17 హైదరాబాద్  సిటీ సైబర్ క్రైమ్ పోలీసులకు  రివర్స్ తో కూడిన  కేసు  అందింది. వివాహిత వేధింపుల నుంచి రక్షింపమని వేడుకుంటూ ఒక యువకుడు పోలీసులను ఆశ్రయించాడు.  సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని  దర్యాప్తు చేస్తున్నారు. 

ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఒక  యువకుడు ఎంబీఏ పూర్తి చేసి హైదరాబాద్ లోని ఒక కంపెనీలో హెచ్ ఆర్ మేనేజర్ గా పని చేశాడు. అమీర్ పేటలో ఉండగా అతనికి  ఒక మహిళతో పరిచయం ఏర్పడింది. ఆమె తన భర్త నుంచి విడిపోయి  పిల్లలతో కలిసి జీవిస్తోంది. ఒకే ప్రాంతంలో ఉండటంతో వారిద్దరి మధ్య పరిచయం మరింత బలపడింది.

కొన్నాళ్ల క్రితం తన కుమారుడి పుట్టిన రోజు  వేడుకలకు ఇంటికి ఆహ్వనించింది. దీంతో ఇంటికి రాకపోకలు సాగించాడు. ఇద్దరిమధ్య మరింత సన్నిహిత్యం  మరింత పెరిగింది.  ఇలా ఉండగా ఒక దశలో ఇద్దరిమధ్య మనస్ఫర్ధలు వచ్చాయి. అప్పటి  నుంచి ఆ యువకుడు ఆమెకు దూరంగా ఉండటం మొదలెట్టాడు. 

యువకుడు తన నుంచి  దూరం కావటం తట్టుకోలేని ఆ వివాహిత యువకుడిపై కక్ష గట్టింది. అతని సోషల్ మీడియా ఫేస్ బుక్ ఎకౌంట్ ను  హ్యాక్ చేసింది. అంతటితో ఆగక అతడి పేరుతో మరో నకిలీ ఖాతా క్రియేట్ చేసింది. వీటిని ఉపయోగించుకుని కొన్ని పోస్టులు పెట్టటం మొదలెట్టింది.

యువకుడి ఒరిజినల్ పేస్ బుక్  నుంచి ఫోటోలు తీసి అతడి ఫోటోలతో పాటు బంధువులవీ వివిధ సైట్స్ లో పోస్టు చేయించేది. ఈ యువకుడి సమీప బంధువల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వారు…అది యువకుడి పనిగానే భావించి వారు యువకుడిపై   పోలీసు స్టేషన్ లో కేసు నమోదు చేశారు. 

 పోలీసులు యువకుడిని విచారించగా జరిగిన పొరపాటు గ్రహించిన యువకుడు  వివాహిత మహిళపై అనుమానం వచ్చి నిలదీశాడు.  తన వద్దకు రావాలని…గతంలో మాదిరిగా తనతో కలిసి ఉండాలని అలా చేస్తేనే ఫేస్ బుక్  పాస్ వర్డ్ చెపుతానని షరతులు పెట్టింది.  ఆమె బెదిరింపులకు భయపడిన యువకుడు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించి వివాహిత మహిళపై  ఫిర్యాదు చేశాడు.  కేసు నమోదు చేసుకున్న పోలీసుల దర్యాప్తు ప్రారంభించారు. 

Also Read | కరోనా బాధితుల మెనూ : ప్రభుత్వ ఆస్పత్రుల్లో దోసె, గుడ్లు, ఆరెంజ్ పంపిణీ!