Police Investigation : గంజాయి కేసులో పట్టుబడ్డ కారులో డీఎస్పీ షికారు.. పోలీసుల విచారణ వేగవంతం

గంజాయి స్మగ్లర్ కారులో షికారు చేసిన అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీజ్ చేసిన కారులో డీఎస్పీ షికారుపై పోలీసుల విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే డీజీపీకి అనకాపల్లి ఎస్పీ గౌతమీచారి నివేదిక ఇచ్చారు.

Police Investigation : గంజాయి కేసులో పట్టుబడ్డ కారులో డీఎస్పీ షికారు.. పోలీసుల విచారణ వేగవంతం

ANAKAPALLI

Police Investigation  : గంజాయి స్మగ్లర్ కారులో షికారు చేసిన అనకాపల్లి డీఎస్పీ సునీల్ కుమార్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. సీజ్ చేసిన కారులో డీఎస్పీ షికారుపై పోలీసుల విచారణ శరవేగంగా కొనసాగుతోంది. ఇప్పటికే డీజీపీకి అనకాపల్లి ఎస్పీ గౌతమీచారి నివేదిక ఇచ్చారు. డీఎస్పీ సునీల్ కుమార్ తో పాటు మరో ఇద్దరిపై వేటుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది. గంజాయి కేసులో సీజ్ చేసిన కొత్త కారుకు పాత నెంబరు ప్లేట్ తగిలించి డీఎస్పీ సునీల్ కుమార్ తిరిగారు. స్కార్పియో కారు నెంబరు ప్లేట్ ను మారుతి కారుకు తగిలించారు.

సీజ్ చేసిన కారును తన సొంత అవసరాలకు వినియోగించారు. కారు నెంబర్ ప్లేట్ ను కూడా మార్చేసి కుటుంబ సభ్యులతో కలిసి విహరించారు. లగ్జరీ కారులో జోరుగా దూసుకుపోతున్న సమయంలో మరో కారును ఢీకొట్టారు. దీంతో సీజ్ చేసిన కారు రోడ్డెక్కించడం, అదీ కూడా నెంబర్ ప్లేట్ మార్చడం ఇవన్నీ బహిర్గతమయ్యాయి. గంజాయి కేసులో పట్టుబడ్డ వాహనాన్నీ డీఎస్సీ సునీల్ కుమార్ తన సొంత అవసరాలకు వాడుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Anakapalle DSP Sunil Kumar : గంజాయి స్మగ్లర్ కారులో షికారు.. అనకాపల్లి డీఎస్పీపై పోలీస్‌ శాఖ సీరియస్‌

ఈ కారులో షికారు చేస్తూ విశాఖలో మరో కారును ఢీకొట్టడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆర్డీఓ కార్యాలయం సమాచారంతో నకిలీ నెంబరు బాగోతం బయటపడింది. దీంతో కారును గంజాయి నిందుతుడి తల్లికి పోలీసులు అప్పగించారు. గంజాయి కేసులో సీజ్ చేసిన కారులో డీఎస్పీ సునీల్ కుమార్ షికారు చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పోలీసులు విచారణ చేపట్టారు. డీజీపీకి ఇప్పడికే నివేదిక అందడంతో డీఎస్పీ సునీల్ కుమార్ పై వేటు వేసేందుకు రంగం సిద్ధమైనట్లు తెలుస్తోంది.