పుల్వామా ఎటాక్…ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది వీళ్లే

  • Published By: venkaiahnaidu ,Published On : March 3, 2020 / 02:41 PM IST
పుల్వామా ఎటాక్…ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించింది వీళ్లే

భారతీయులు మర్చిపోలేని రోజు ఫిబ్రవరి-14,2019. కశ్మీర్ రాష్ట్రంలోని పుల్వామాలో పాకిస్తాన్ ఉగ్రసంస్థ జైషే మొహమ్మద్ జరిపిన టెర్రర్ ఎటాక్ లో 40మంది భారత జవాన్లు ప్రాణాలు కోల్పోయిన ఘటనను దేశ ప్రజలెవ్వరూ మర్చిపోలేదు. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారణంగా పాకిస్తాన్ లోని బాలాకోట్ లో ఉన్న ఉగ్రశిబిరాలపై భారత వాయుసేన మెరుపు దాడులు చేసి ఉగ్రశిబిరాలను నేలమట్టం చేసిన విషయం తెలిసిందే.

అయితే ఇప్పుడు పుల్వామా ఉగ్రదాడి కేసులో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. కశ్మీర్ కు చెందిన పీర్ తారిఖ్,ఆయన కూతురు ఇన్షాను మంగళవారం(మార్చి-3,2020)జాతీయ దర్యాప్తు సంస్థ(NIA)అరెస్ట్ చేసింది. పుల్వామా ఉగ్రవాది వెనుక జరిగిన కుట్రను ఎన్ఐఏ దర్యాప్తు చేస్తున్న విషయం తెలిసిందే.

అయితే పుల్వామా ఉగ్రదాడికి పాల్పడిన ఉగ్రవాదులకు  పీర్ తారిఖ్,ఆయన కూతురు ఇన్షా ఆశ్రయం కల్పించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పుల్వామా ఉగ్రదాడి తర్వాత జైషే మొహమ్మద్ రిలీజ్ చేసిన వీడియో దక్షిణ కశ్మీర్ లో ఉన్న పీర్ తారిఖ్ నివాసంలోనే చిత్రీకరించినట్లు ఎన్ఐఏ గుర్తించి..తండ్రీ,కూతురిని అరెస్ట్ చేసింది. వారిని కస్టడీకి కోరేందుకు జమ్మూకు తరలించినట్లు సమాచారం.