Telangana: కోతుల దాడిలో వృద్ధురాలు మృతి.. ఒక్కసారిగా దాడి చేసిన కోతుల గుంపు

నర్సవ్వ అనే 70 ఏళ్ల వృద్ధురాలు శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె కూతురు ఒక పెళ్లి వేడుక కోసం వెళ్లడంతో నర్సవ్వ ఇంటి వద్ద ఒంటరిగా ఉండిపోయింది. ఇంటి బయట నర్సవ్వ పాత్రలు శుభ్రం చేస్తుండగా 20కిపైగా ఉన్న కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆ సమయంలో ఆమె సాయం కోసం అరిచింది.

Telangana: కోతుల దాడిలో వృద్ధురాలు మృతి.. ఒక్కసారిగా దాడి చేసిన కోతుల గుంపు

Telangana: గత నెలలో హైదరాబాద్‌లో కుక్కల దాడిలో బాలుడు మరణించిన ఘటన మరువక ముందే, తెలంగాణలో మరో దారుణ ఘటన జరిగింది. కోతుల దాడులో ఒక వృద్ధురాలు మరణించింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా, రామారెడ్డి గ్రామంలో గత శుక్రవారం జరిగింది.

Manish Sisodia: జైల్లో సిసోడియాకు వేధింపులు.. బెదిరించి సంతకాలు తీసుకుంటున్నారు.. సీబీఐపై ఆప్ ఆరోపణ

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన చాతర్బోయిన నర్సవ్వ అనే 70 ఏళ్ల వృద్ధురాలు శుక్రవారం ఇంట్లో ఒంటరిగా ఉంది. ఆమె కూతురు ఒక పెళ్లి వేడుక కోసం వెళ్లడంతో నర్సవ్వ ఇంటి వద్ద ఒంటరిగా ఉండిపోయింది. ఇంటి బయట నర్సవ్వ పాత్రలు శుభ్రం చేస్తుండగా 20కిపైగా ఉన్న కోతుల గుంపు ఒక్కసారిగా ఆమెపై దాడి చేసింది. ఆ సమయంలో ఆమె సాయం కోసం అరిచింది. కానీ, కోతుల గుంపు ఎక్కడ తమ ఇంట్లోకి వస్తుందేమో అనుకుని చుట్టుపక్కల అందరూ తమ ఇండ్లకు తలుపులు వేసుకుని లోపలే ఉండిపోయారు. నర్సవ్వను రక్షించేందుకు ఎవరూ ముందుకు రాలేదు.

Right To Pee: నాగ్‌పూర్‌లో పబ్లిక్ టాయిలెట్ల కోసం మహిళల ఉద్యమం.. ప్లకార్డులతో నిరసన

దీంతో కోతులు నర్సవ్వపై పడి తీవ్రంగా దాడి చేశాయి. ఈ దాడిలో నర్సవ్వ ఛాతి, వీపుతోపాటు శరీరమంతా గాయాలయ్యాయి. దాడి చేసిన తర్వాత కోతులు వాటంతట అవే వెళ్లిపోయాయి. అయినప్పటికీ నర్సవ్వను ఎవరూ పట్టించుకోలేదు. చాలా సేపటికి ఆమె కూతురు ఫంక్షన్ నుంచి ఇంటికి తిరిగొచ్చింది. అప్పటికే తీవ్ర గాయాలపాలైన నర్సవ్వను చూసి షాకైంది. వెంటనే ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లి అక్కడ చికిత్స అందించింది. అయితే, చికిత్స అందించినప్పటికీ తీవ్ర గాయాల కారణంగా నర్సవ్వ శనివారం ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు.