Truck Driver Hijack : ఆక్సిజన్ సిలిండర్ల లారీ హైజాక్… లక్ష రూపాయలు డిమాండ్

రోగులకు అందించాల్సిన ఆక్సిజన్ సిలిండర్ల లారీని హైజాక్ చేసి.. డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.

Truck Driver Hijack : ఆక్సిజన్ సిలిండర్ల లారీ హైజాక్… లక్ష రూపాయలు డిమాండ్

Truck Driver Hijack Vehicle Carrying Over 50 Oxygen Cylinders

Truck Driver Hijack : దేశంలో కరోనా కేసులు పెరుగుతున్ననేపధ్యంలో ఆస్పత్రుల్లో బెడ్లు దొరక్క దోపిడీ ఎక్కవైందనే వార్తలు ఒక పక్క…. ఆక్సిజన్ సిలిండర్లు లేక పేషెంట్లు చనిపోతున్నారనే వార్తలు మరోపక్క చూస్తున్నాం. రోగులకు అందించాల్సిన ఆక్సిజన్ సిలిండర్ల లారీని హైజాక్ చేసి.. డబ్బులు డిమాండ్ చేసిన ఘటన ఉత్తర ప్రదేశ్ లోని ఘజియాబాద్ లో చోటు చేసుకుంది.

దేశ రాజధాని ఢిల్లీ నుంచి అమ్రోహి కి 50 ఆక్సిజన్ సిలిండర్లతో ఆదివారం రాత్రి ఓ లారీ బయలు దేరింది. లారీ సిహాని గేట్ ప్రాంతంలో ఉండగా బొలేరో వాహనంలో వచ్చిన దుండగుడు డ్రైవర్ అమోద్ ను బెదిరించి లారీని దారి మళ్లించాడు.

లారీని ఘుక్నా మోడ్ వద్దకు వెళ్ళాక లారీ డ్రైవర్ వాహనాన్ని నిలిపివేశాడు.  దీంతో హైజాకర్ కు.. డ్రైవర్ అమోద్ కు మధ్య ఘర్షణ జరిగింది. ఈలోపు బోలేరో వాహనం వద్దకు మరో ఇద్దరు దుండగులు వచ్చారు. ముగ్గురు కలిసి లారీని హిందన్ నదికి సమీపంలో ఉన్న వసుంధర రైల్వే లైన్ వద్దకు తీసుకువెళ్లారు.

అక్కడ లారీ డ్రైవర్ ఆమోద్ ను తీవ్రంగా కొట్టారు. వారు దాడిచేసిన దృశ్యాలను వీడియోతీసి లారీ ఓనర్ కు వాట్సప్ లో పంపిస్తూ లక్ష రూపాయలు డిమాండ్ చేశారు. రోగులు ఆక్సిజన్ అందక చనిపోతున్నారని చెప్పినా హైజాకర్లు వినలేదు. హైజాకర్లు డ్రైవర్ ను మీరట్ రోడ్డులో దింపి.. డబ్బు వచ్చినప్పుడు సంప్రదించమని చెప్పిలారీ తీసుకు వెళ్లి పోయారు.

లారీ హైజాక్ అయిన విషయం యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనకు వచ్చిన ఫోన్ నెంబరు వివరాలును పోలీసులుకు ఇచ్చాడు. ఫోన్ ట్రాకింగ్ ద్వారా లారీ ఎక్కడుందో కనిపెట్టిన పోలీసులు ఘజియాబాద్ లోని హాపూర్ రోడ్డులో స్వాధీనం చేసుకున్నారు.

నిందితులు టింకు, జితేంద్రకుమార్ సింగ్, వినయ్ చౌహాన్ లను అరెస్ట్ చేసి.. వారు ఉపయోగించిన బొలేరా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. ఆక్సిజన్ సిలిండర్ల లారీని స్వాధీనం చేసుకుని అమ్రోహ్ కుపంపించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.