Viral Video: ఇంట్లో పనిచేయించుకోవడానికి అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లిన మహిళ

పని మనిషి పట్ల దారుణంగా వ్యవహరించింది ఓ మహిళ. పనికి రానని చెబుతున్నప్పటికీ ఓ అమ్మాయిని లిఫ్టులో నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, క్లియో కౌంటీ సొసైటీ సెక్టార్ 120లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలివేటర్ లోని సీసీటీవీ కెమెరా ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

Viral Video: ఇంట్లో పనిచేయించుకోవడానికి అమ్మాయిని బలవంతంగా లాక్కెళ్లిన మహిళ

Viral Video: పని మనిషి పట్ల దారుణంగా వ్యవహరించింది ఓ మహిళ. పనికి రానని చెబుతున్నప్పటికీ ఓ అమ్మాయిని లిఫ్టులో నుంచి బలవంతంగా లాక్కెళ్లింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఉత్తరప్రదేశ్ లోని నోయిడా, క్లియో కౌంటీ సొసైటీ సెక్టార్ 120లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఎలివేటర్ లోని సీసీటీవీ కెమెరా ద్వారా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

అనిత (20) అనే ఓ యువతి ఓ ఇంట్లో పనిచేస్తుంటుంది. అయితే, ఆమెను ఆ కుటుంబంలోని వారు వేధిస్తున్నారు. దీంతో తన ఇంటికి వెళ్లిపోతానని అని కన్నీరు పెట్టుకుంది. ఇంటి యజమానుల నుంచి తప్పించుకుని వెళ్లిపోవడానికి యత్నించింది. అనితను ఇంటి పరిసరాల ప్రాంతంలో పట్టుకున్న ఓ మహిళ లిఫ్టులో ఆమెను లాక్కెళ్లింది.

తాను రానని, తనను వెళ్లనివ్వాలని అనిత ఎంతగా ఏడ్చినా ఆ మహిళ కనికరించలేదు. అనిత లిఫ్టును పట్టుకుని చాలా సేపు పెనుగులాడింది. అయినప్పటికీ అనితను ఆ మహిళ లాక్కెళ్లింది. ఈ వీడియో బయటకు వచ్చి పోలీసుల వరకు వెళ్లింది. దీంతో పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు జరుపుతున్నారు. అనితను ఆమె పనిచేస్తోన్న ఇంట్లోని వారు తీవ్రంగా కొట్టిన దెబ్బలు ఆమె శరీరంపై కనపడినట్లు తెలుస్తోంది.

Year End Sale on Flipkart : ఫ్లిప్‌కార్ట్‌లో ఇయర్ ఎండ్ సేల్.. రూ. 15వేల లోపు స్మార్ట్‌ఫోన్‌లపై టాప్ డీల్స్.. లిమిటెడ్ ఆఫర్ మాత్రమే.. త్వరపడండి..!