High Cholesterol : చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే 7 అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు !

బేకరీ వస్తువులలో బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు, పఫ్‌లు, క్రీమ్ రోల్స్ మొదలైనవి ఉంటాయి. వీటి తయారీలో డాల్డా వంటి వాటిని ఉపయోగిస్తారు. వనస్పతిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.

High Cholesterol : చెడు కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచే 7 అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు !

high cholesterol

High Cholesterol : నిశ్చల జీవనశైలి అనేక జబ్బులను కలిగిస్తుంది. చెడు ఆహారపు అలవాట్ల కారణంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తినాలన్న కోరిక కలిగినప్పుడల్లా ఉప్పుతో కూడిన చిరుతిళ్లు, పంచదారతో స్వీట్లు తీసుకోవటం వల్ల చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగే ప్రమాదం ఉంటుంది. రోజంతా వ్యాయామం లేకుండా కూర్చోవడం కొవ్వు పదార్ధాలు ప్రోగబడి గుండె జబ్బులు, మధుమేహం, ఫ్యాటీ లివర్ వంటి అనేక ఇతర ప్రాణాంతక జీవనశైలి వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంటుంది.

READ ALSO : Avoid These Foods : చెడు కొలెస్ట్రాల్ పుష్కలంగా ఉండే ఈ ఆహారాలను నివారించండి !

వేగవంతమైన జీవనశైలిలో, ప్రజలు సులభంగా శ్రమపడి వండే పనిలేకుండా ప్యాక్డ్ ఫుడ్‌కు అలవాటుపడటం ఆనవాయితీగా మారింది. భోజనానికి, బోజనానికి మధ్య అనారోగ్యకరమైన ఫుడ్స్ తినడం కూడా కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచడానికి కారణమవుతుంది.

అయితే అన్ని కొలెస్ట్రాల్స్ చెడ్డవి కావు. వాస్తవానికి మన శరీరం బాగా పనిచేయడం కొలెస్ట్రాల్ చాలా ముఖ్యం. శరీరం నుండి చెడు కొలెస్ట్రాల్ అనగా తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (LDL) కొలెస్ట్రాల్‌ను తొలగించడంతో పాటు గుండె జబ్బులు మరియు స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడానికి ఆరోగ్యకరమైన మొత్తంలో అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ (HDL) అనగా మంచి కొలెస్ట్రాల్ కలిగి ఉండటం చాలా ముఖ్యం.

READ ALSO : Bad Cholesterol : శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తొలగిపోవాలంటే రోజువారిగా ఈ కూరగాయలను ఆహారంలో చేర్చుకోవటం మంచిది!

తక్కువ HDL, అధిక LDL ఉన్న ట్రైగ్లిజరైడ్‌లు అథెరోస్క్లెరోసిస్, ఇతర జీవక్రియ వ్యాధులు, గుండెపోటు వంటి ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని పెంచుతాయి. అందువల్ల, కొవ్వు పదార్ధాలను తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం, ఎందుకంటే అది అనేక జీవనశైలి వ్యాధులకు కారణమవుతుంది.

LDL కొలెస్ట్రాల్‌ను పెంచే 7 చెడు ఆహారపు అలవాట్లు ;

1. బేకరీ వస్తువులను వినియోగించడం : బేకరీ వస్తువులలో బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు, పఫ్‌లు, క్రీమ్ రోల్స్ మొదలైనవి ఉంటాయి. వీటి తయారీలో డాల్డా వంటి వాటిని ఉపయోగిస్తారు. వనస్పతిలో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి.

2. ప్రాసెస్ చేసిన మాంసాలను తినడం ; సాసేజ్‌లు, సలామీ, బర్గర్ ప్యాటీలు, బేకన్ మొదలైన మాంసాలు ఎక్కువ కాలంపాటు నిల్వ ఉండేందుకు ఉప్పుతోపాటు ఇతర రసాయన సంరక్షణకారకాలతో నిక్షిప్తం అయి ఉంటాయి. అవి చెడు కొలెస్ట్రాల్‌ ను పెంచటం మాత్రమే కాకుండా క్యాన్సర్ కారకాలు. వీటిని పూర్తిగా నివారించడం మంచిది.

READ ALSO : Coriander : చెడు కొలెస్ట్రాల్, రక్తపోటును నియంత్రించడంలో సహాయపడే కొత్తిమీర!

3. ఫాస్ట్ ఫుడ్ ను స్నాక్స్ గా తీసుకోవడం ; పావ్ భాజీ, సమోసా, భాతుర్ వంటి భారతీయ ఫాస్ట్ ఫుడ్స్ మరియు పిజ్జా, బర్గర్లు మొదలైన పాశ్చాత్య ఆహారాలలో ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. వీటిని వేయించడానికి మళ్లీ వేడిచేసిన నూనె, అధిక కొవ్వు , అధిక పిండి పదార్థాలు, తక్కువ పీచుపదార్థాలు వినియోగించటం హానికరంగా మారతాయి. కొలెస్ట్రాల్‌ను పెంచడమే కాకుండా ఊబకాయం ,మధుమేహానికి కారణమౌతాయి.

4. ఆహారంలో పండ్లు మరియు కూరగాయలు తక్కువగా తీసుకోవడం ; పండ్లు ,కూరగాయలలో అధిక ఫైబర్ ఉంటుంది, ఇది ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను తగ్గించడానికి, హెచ్‌డిఎల్ కొలెస్ట్రాల్‌ను పెంచడానికి సహాయపడుతుంది. దీనితో పాటు, పండ్లు మరియు కూరగాయలలో యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న ఫైటోన్యూట్రియెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. శరీరం నుండి విషాన్ని తొలగించి కాలేయం, ప్రేగులు, మూత్రపిండాల వంటి ముఖ్యమైన అవయవాలను శుభ్రపరుస్తాయి.

READ ALSO : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి గుండె ఆరోగ్యాన్ని మెరుగు పరిచే మిల్లెట్స్!

5. కరిగే ఫైబర్ తక్కువగా ఉన్న ఆహారాన్ని తినడం ; కరిగే ఫైబర్ పేగుల నుండి నీటిని తీసుకుంటుంది. ఇది మలాన్ని మృదువుగా చేస్తుంది. కొలెస్ట్రాల్‌ ను బంధించి శరీరం నుండి తొలగించగలదు. ఓట్స్, బఠానీలు, యాపిల్, జామ, క్యారెట్, సిట్రస్ పండ్లలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకునేలా చూసుకోండి.

6. ప్రాసెస్డ్ ఫుడ్స్‌ ; ప్యాకెట్లలో లభించే ఎక్కువ కాలం నిల్వ ఉండే ఏదైనా ఆహారం ప్రాసెస్ చేయబడిందని అర్థం. ప్రాసెసింగ్ , ప్యాకింగ్ ప్రామాణికంగా లేకుంటే ఆ ఆహారాలు చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. ప్రాసెస్ చేసిన ఆహారాలను ఎంచుకునే ముందు అవి ఆరోగ్యమైనవో కావో నిర్ధారించుకోవటం మంచిది.

READ ALSO : Ragi Flour : చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించి బరువును నియంత్రణలో ఉంచే రాగిపిండి!

7. అధిక చక్కెర ఆహారాలు ; ప్యాక్ చేసిన పండ్ల రసాలు, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కలిగిన ఉత్పత్తులు, వైట్ బ్రెడ్ వంటి డెజర్ట్‌లు చక్కెరను కలిగి ఉంటాయి. ఈ చక్కెరలు శరీరంలో కొవ్వుగా మార్చబడతాయి. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.