Hijab Row: హిజాబ్ ధరిస్తే కాలేజీలకు రానివ్వడం లేదంటూ టీసీలు తీసుకుని వెళ్ళిపోయిన 145 మంది విద్యార్థినులు

హిజాబ్ ధరించనివ్వడం లేదని పలు కాలేజీలకు చెందిన 145 మంది విద్యార్థినులు టీసీలు తీసుకుని వెళ్ళిపోయారు. మంగళూరు విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ పీఎస్ ఎడపడితాయ ఈ వివరాలను మీడియాకు చెప్పారు. గత రెండు విద్యా సంవత్సరాల్లో దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో పలు కాలేజీల్లో మొత్తం 900 మంది ముస్లిం విద్యార్థినులు పలు కోర్సుల్లో చేరారని చెప్పారు. వారిలోనే 145 మంది (దాదాపు 16 శాతం మంది) హిజాబ్ వివాదం నేపథ్యంలో టీసీలు తీసుకున్నారని తెలిపారు.

Hijab Row: హిజాబ్ ధరిస్తే కాలేజీలకు రానివ్వడం లేదంటూ టీసీలు తీసుకుని వెళ్ళిపోయిన 145 మంది విద్యార్థినులు

Hijab Row

Hijab Row: హిజాబ్ ధరిస్తే కాలేజీలకు రానివ్వడం లేదంటూ కర్ణాటకలో దాదాపు 145 మంది విద్యార్థినులు టీసీ (బదిలీ సర్టిఫికెట్లు)లు తీసుకున్నారు. కర్ణాటకలో హిజాబ్‌ వివాదం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. సమానత్వానికి, శాంతి భద్రతలకు భంగం కలిగించేలా ఉండే దుస్తులు వేసుకుని విద్యాలయాలకు రావద్దని కర్ణాటక ప్రభుత్వం ఆదేశించడంతో హిజాబ్‌ అంశం ఆ రాష్ట్రంలో వివాదాస్పదంగా మారింది. ఈ నేపథ్యంలోనే, హిజాబ్ ధరించవద్దని మంగళూరు విశ్వవిద్యాలయం ఈ ఏడాది మేలో ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో, ఆ విశ్వవిద్యాలయ పరిధిలోని కాలేజీలు హిజాబ్ ధరించి రావద్దని విద్యార్థులకు సూచిస్తున్నాయి.

హిజాబ్ ధరించనివ్వడం లేదని పలు కాలేజీలకు చెందిన 145 మంది విద్యార్థినులు టీసీలు తీసుకుని వెళ్ళిపోయారు. మంగళూరు విశ్వవిద్యాలయ ఉప కులపతి ప్రొఫెసర్ పీఎస్ ఎడపడితాయ ఈ వివరాలను మీడియాకు చెప్పారు. గత రెండు విద్యా సంవత్సరాల్లో దక్షిణ కన్నడ, ఉడుపి జిల్లాల్లో పలు కాలేజీల్లో మొత్తం 900 మంది ముస్లిం విద్యార్థినులు పలు కోర్సుల్లో చేరారని చెప్పారు. వారిలోనే 145 మంది (దాదాపు 16 శాతం మంది) హిజాబ్ వివాదం నేపథ్యంలో టీసీలు తీసుకున్నారని తెలిపారు. చదువు మానేస్తే వారి భవిష్యత్తు నాశనం అవుతుందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, దూర విద్య ద్వారా చదువు కొనసాగించాలని వారికి సూచించామని వివరించారు.

China-taiwan conflict: తైవాన్‌లో అస్థిరత తీసుకురావడానికి పనిచేస్తోన్న ఏజెంట్‌లా చైనా వ్యవహరించవద్దు: అమెరికా వార్నింగ్