Video viral: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. వరద ధాటికి కుప్పకూలిపోయిన రైల్వే బ్రిడ్జి

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చక్కీ నది నిండి ఉగ్రరూపం దాల్చింది. కంగ్రా జిల్లాలోని నీటి ఉద్ధృతికి చక్రీ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చక్రీ రైల్వే బ్రిడ్జిలోని ఒక పిల్లర్ పూర్తిగా ధ్వంసమైంది. ధర్మశాలలో అతి భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి.

Video viral: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు.. వరద ధాటికి కుప్పకూలిపోయిన రైల్వే బ్రిడ్జి

Video viral

Video viral: హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. చక్కీ నది నిండి ఉగ్రరూపం దాల్చింది. కంగ్రా జిల్లాలోని నీటి ఉద్ధృతికి చక్రీ రైల్వే బ్రిడ్జి కుప్పకూలింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. చక్రీ రైల్వే బ్రిడ్జిలోని ఒక పిల్లర్ పూర్తిగా ధ్వంసమైంది. ధర్మశాలలో అతి భారీ వర్షాలు కురవడంతో కొండచరియలు విరిగిపడ్డాయి.

మండీ జిల్లాలో భారీ వరదలు సంభవించాయి. దీంతో ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. దుకాణాలు, ఇళ్ళలోకి భారీగా వరద నీరు ప్రవహించింది. రోడ్డుపై పార్క్ చేసిన వాహనాలు వరదలో కొట్టుకుపోయాయి. కంగ్రా, కుల్లు, మండీ జిల్లాల్లో పాఠశాలలు, కార్యాలయాలకు సెలవులు ప్రకటించారు. నేడు కంగ్రా, చంబా, బిలాస్పూర్, సిర్మౌర్, మండీ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని భారత వాతావరణ శాఖ (ఐఎండీ) తెలిపింది. ప్రజలు అనవసర ప్రయాణాలు చేయొద్దని సూచించింది. ఆగస్టు 25 వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కొండచరియలు విరిగిపడే ముప్పు ఉందని హిమాచల్ ప్రదేశ్ విపత్త నిర్వహణ శాఖ పేర్కొంది.