Earthquake : అఫ్ఘానిస్తాన్ లో భూకంపం..ఢిల్లీ, జమ్మూకశ్మీర్‌లోనూ భూ ప్రకంపనలు
అఫ్ఘానిస్తాన్ లో భూకంపం సంభవించింది.అలాగే భారత్ లోని ఢిల్లీ, జమ్మూకశ్మీర్, నోయిడా, ఉత్తరాఖండ్ లలో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి.

Earthquake
5.7 magnitude earthquake hits afghanistan : ఈరోజు ఉదయం మూడు దేశాల్లో భూకంపాలు సంభవించాయి. అఫ్ఘానిస్తాన్ లో భూ కంపం సంభవించగా..సరిహద్దు దేశమైన పాకిస్థాన్ లో కూడా భూ ప్రకంపంచనలు సంభవించాయి. అలాగే భారత్ లోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూ ప్రకంపనలు సంభవించాయి. శనివారం (ఫిబ్రవరి 5,2022) సరిహద్దు దేశాల్లో సంభవించిన ఈ భూకంపం పాకిస్తాన్, అప్ఘానిస్థాన్ లలో 5.7 తీవ్రతగా నమోదు అయ్యింది. అలాగే ఉత్తర భారతంలోని ఢిల్లీ, జమ్ముకశ్మీర్,ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, ఉత్తరాఖండ్ లలో కూడా భూ ప్రకంపనలు జరిగాయి.
5.7 తీవ్రతతో అఫ్ఘానిస్తాన్-తజకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో భూకంప కేంద్రం ఉంది అధికారులు భావిస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలో సుమారు 20 సెకన్ల పాటు భూమి కంపించినట్లు కొందరు ట్వీట్ చేశారు. ఢిల్లీలో కూడా ప్రకంపనలు వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఆఫ్ఘన్-తజకిస్తాన్ బోర్డర్‌లో 9.45 నిమిషాలకు భూకంపం నమోదు అయినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ తెలిపింది. 181 కిలోమీటర్ల లోతులో భూమి కంపించినట్లు సెంటర్ పేర్కొన్నది.
కాగా అప్ఘానిస్థాన్ లో తాలిబన్లు కష్టాలతో పాటు ప్రజలు ఇటీవల సంభవిస్తున్న భూకంపాలతో కూడా ప్రజలు అల్లాడిపోతున్నారు.గత జనవరిలో కూడా సంభవించిన భూకంపం ప్రభావానికి 26మంది ప్రాణాలు కోల్పోయారు. పలు కుటుంబాలు నిరాశ్రయులయ్యారు. పశ్చి అఫ్ఘానిస్థాన్ లోని బాద్గీస్ లోని ఖాదీస్ జిల్లాలో భూ కంపానికి ప్రజలు అల్లాడిపోయారు. ఇళ్ల కప్పులు కూలిపోయి 26మంది మరణించారు. వీరిలో ఐదుగురు మహిళలతో పాటు నలుగురు చిన్నారులు కూడా ఉన్నారు.