Petrol price India : అమెరికాతోపాటు ఆరు దేశాల కంటే భారత్‌లోనే పెట్రోల్ ధర అధికం

ప్రస్తుతం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నా.. భార‌త్‌లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు అధికంగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఎక‌న‌మిక్ రీసెర్చి నివేదిక పేర్కొంది.

Petrol price India : అమెరికాతోపాటు ఆరు దేశాల కంటే భారత్‌లోనే పెట్రోల్ ధర అధికం

India

petrol prices in India : భారత్ లో వేసవి ఎండలకుతోడు పెట్రో మంటలు మండుతున్నాయి. గతకొన్ని రోజులుగా పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతూనేవున్నాయి. అమెరికా, ర‌ష్యా, చైనా, జ‌పాన్‌, బ్రెజిల్‌, పాకిస్థాన్, శ్రీ‌లంక‌ కంటే భార‌త్‌లోనే పెట్రోల్ ధ‌ర ఎక్కువ అని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ప‌రిశోధ‌న‌లో తేలింది. ప్రస్తుతం అంత‌ర్జాతీయ మార్కెట్‌లో ముడి చ‌మురు ధ‌ర‌లు త‌క్కువ‌గా ఉన్నా.. భార‌త్‌లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌లు అధికంగా ఉన్నాయని బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఎక‌న‌మిక్ రీసెర్చి నివేదిక పేర్కొంది.
PM Modi : పెట్రోల్ ధరలు పెరుగుదల.. రాష్ట్ర ప్రభుత్వాలపై మోదీ సంచలన వ్యాఖ్యలు

ప్రపంచ‌వ్యాప్తంగా 106 దేశాల్లో పెట్రోల్‌, డీజిల్ ధ‌ర‌ల ఆధారంగా బ్యాంక్ ఆఫ్ బ‌రోడా ఈ నివేదిక‌ను రూపొందించింది. పౌరుల త‌ల‌స‌రి ఆదాయంతో పోలిస్తే వియ‌త్నాం, కెన్యా, ఉక్రెయిన్‌, బంగ్లాదేశ్, నేపాల్, పాకిస్థాన్‌, శ్రీ‌లంక, వెనిజులా దేశాల కంటే భార‌త్‌లో పెట్రోల్, డీజిల్ ధ‌ర‌లు ఎక్కువ‌గా ఉన్నాయి. పెట్రోల్ ధ‌ర‌లు అధికంగా ఉన్న దేశాల్లో త‌ల‌స‌రి ఆదాయం కూడా ఎక్కువ‌. కానీ భార‌త్‌లో అందుకు భిన్నమైన ప‌రిస్థితులు నెల‌కొన్నాయని పేర్కొంది.